RIVER: రక్షణ చర్యలు లేని చిత్రావతి
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:31 PM
సత్య సాయి జయంతి వేడుకల సందర్భంగా చిత్రావతి సుందరీకరణ ఏర్పాట్లు చేశారు. అందులో భాగం గా స్నాన ఘట్టం ఏర్పాటు చేశారు. అయితే కొన్ని రక్షణ చర్యలు చేప ట్టకపోవడంతో భక్తులు ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రమాదా లు జరిగే అవకాశాలు లేకపోలేదని పలువురు అంటున్నారు. జిల్లా కేం ద్రం సమీపంలో చిత్రావతి నది నీటితో నిండుగా ఉంటూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
- నిండుగా ప్రవహిస్తుండడంతో పొంచి ఉన్న ప్రమాదం
- స్థానికుల అభిప్రాయం
పుట్టపర్తి, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): సత్య సాయి జయంతి వేడుకల సందర్భంగా చిత్రావతి సుందరీకరణ ఏర్పాట్లు చేశారు. అందులో భాగం గా స్నాన ఘట్టం ఏర్పాటు చేశారు. అయితే కొన్ని రక్షణ చర్యలు చేప ట్టకపోవడంతో భక్తులు ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ప్రమాదా లు జరిగే అవకాశాలు లేకపోలేదని పలువురు అంటున్నారు. జిల్లా కేం ద్రం సమీపంలో చిత్రావతి నది నీటితో నిండుగా ఉంటూ పర్యాటకులను ఆకర్షిస్తోంది.ఇటీవల కురుస్తున్న వర్షాలకు నది పొంగిపొర్లింది. చెక్ డ్యాం సైతం నిండుగా నీటితో నిండుగాఉంది. మరోపక్క ఎ నుముల పల్లి చెరువు నిండి మరువ వెళ్తోంది. అయితే ఇవి కాస్త పర్యాట కులకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెండు వా రాల్లో పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు జరగనున్నాయి. భ క్తులు లక్షల్లో పాల్గొనే అవకాశం ఉంది. సత్యసాయి నడియాడిన చిత్రావ తి నది పరివాహక ప్రాంతాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. ఈ తరుణంలో వారు నదిలో పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉంది.
భక్తుల కోసం నదికి ఒక ప్రాంతంలో హారతి స్నాన ఘట్టాన్ని ఏర్పాటు చేశారు. సుందరీకణ కోసం నది పరివాహక ప్రాంతంలో చెట్లను తొలగిం చి మట్టిని వేశారు. అయితే నదిలోతు తెలియని భక్తులు నదిలో దిగితే వారి ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చిత్రా వతి హారతి ఘాట్ వద్ద నదిలోకి మెట్లను ఏర్పాటు చేశారు. అయితే మెట్లు దిగి కిందికి వెళితే దాదాపు పది అడుగుల వరకు లోతు నీరుంది. తెలియని భక్తులు పొరబాటున మెట్ల మీద నుంచి నీళ్లలో జారిపడినా ప్రాణాపాయం జరిగే అవ కాశం లేకపోలేదు. గతంలో హారతి ఘాట్ వద్ద నదిలోకి దిగి ప లువురు ప్రమాదంలో పడిన సంఘటనలు ఉన్నాయి. అ లాగే ఎనుములపల్లి చెరువు వద్ద రోడ్డు వెళుతుంది. ఆ రోడ్డు ఇరుకుగా ఉండడం వల్ల వేగంగా వచ్చే వాహనాలు అదుపు తప్పితే చెరువులో పడే అవకాశం ఉంది. సుందరీకరణ పనులు అయితే చేశారు కానీ, చిత్రావతి నది పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి రక్షణ ఏర్పా ట్లు చేయక పోవడం విమర్శలకు తావిస్తోంది. భక్తులు అధిక సంఖ్యంలో వచ్చినప్పుడు పలువురు తెలియ నీటిలో పడే అవకాశం ఉందని, అలా జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....