KGBV: పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టాలి
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:52 PM
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని రాష్ట్ర ఆహర కమిషన సభ్యురాలు గంజిమాల దేవి సూచించారు. ఆమె మంగళవారం ముదిగుబ్బ మండల కేంద్రం లోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)ని తనిఖీ చేశారు. పాఠశాలలో నిత్యావసర వస్తువులను, ఆహార తయారీని, విద్యార్థులకు అందుతున్న మౌళిక వసతులను, వంటశాలను పరిశీలించారు.
రాష్ట్ర ఆహార కమిషన సభ్యురాలు గంజిమాల దేవి
ముదిగుబ్బ కేబీబీవీ తనిఖీ
ముదిగుబ్బ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని రాష్ట్ర ఆహర కమిషన సభ్యురాలు గంజిమాల దేవి సూచించారు. ఆమె మంగళవారం ముదిగుబ్బ మండల కేంద్రం లోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)ని తనిఖీ చేశారు. పాఠశాలలో నిత్యావసర వస్తువులను, ఆహార తయారీని, విద్యార్థులకు అందుతున్న మౌళిక వసతులను, వంటశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, ప్రీస్కూల్ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను ప్రభుత్వ నిర్దేశిత ప్రమాణాల మేరకు అమలు చేయాలని సూచించారు. పాఠశాలల్లో మ ధ్యాహ్న భోజనంలో నాణ్యమైన శుభ్రమైన పౌష్టికాహారం అందించాలని, లేకపోతే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.
అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కదిరి అర్బన: రాష్ట్ర ఫుడ్ కమిషన సభ్యులు గంజిమాల దేవి మంగళవారం మండలంలోని ఆంధ్రప్రదేశ సాంఘిక సంక్షేమ పాఠశాల, పట్టణంలోని బీసీ కళాశాల హాస్టళ్లను తనిఖీచేశారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలపై ఆమె విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. విద్యార్థులకు అం దిస్తున్న భోజన నాణ్యతపై ఆరా తీశారు. హాస్టళ్లలో మెనూ ఖచ్చితంగా పాటించాలని వార్డెన్లను ఆదేశించారు.
ఎంఎస్‌ఎల్ పాయింట్ తనిఖీ
ధర్మవరం: మార్యెట్ యార్డులో ఉన్న ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను మంగళవారం రాష్ట్ర ఆహార కమిషన సభ్యురాలు గంజిమాల దేవి తనిఖీ చేశారు. చౌకదుకాణాలకు పంపిణీ చేసే బియ్యం, చక్కెర, తదితర సరుకుల నిల్వలను, స్టాకు నిల్వ రికార్డులను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో స్టాక్ పాయింట్ అధికారి ప్రసన్నకుమార్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....