MLA: పేద కుటుంబాలకు చంద్రబాబు అండ
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:30 AM
పేద కుటుంబాలను ఆదు కునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొండంత ఆండగా ఉన్నారని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే సోమవా రం స్థానిక క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఎమ్మెల్యే సింధూరరెడ్డి ఫ సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
పుట్టపర్తి రూరల్, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): పేద కుటుంబాలను ఆదు కునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొండంత ఆండగా ఉన్నారని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే సోమవా రం స్థానిక క్యాంపు కార్యాలయంలో పలువురికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 20 మంది పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 14,87,012 లక్షల చెక్కులను మాజీమంత్రి పల్లె రఘునాథ రెడ్డితో కలసి ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ... ఏడాది కాలంలోనే నియోజకవర్గంలో 150 మందికి రూ. 2.55 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేద లబ్దిదారులకు ఆర్థిక సహాయం అందచేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, మెరుగైన జీవితాన్ని పొందాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ మండల కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....