AGRI: 3న చలో విజయవాడ
ABN , Publish Date - Nov 30 , 2025 | 11:46 PM
తమకు న్యాయం చేయాలంటూ ఈ నెల 3వ తేదీన చలో విజయవాడ (అగ్రిగోల్డ్ బాధి తుల ఆవేదన యాత్ర) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అగ్రిగోల్డ్ బాధి తుల సంఘం మండల కార్యదర్శి షమీవుల్లా ఆదివారం తెలిపారు. ఆయన ఆదివారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ... అగ్రిగోల్డ్ కంపెనీ చేతిలో మోసపోయి, చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.
గాండ్లపెంట, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): తమకు న్యాయం చేయాలంటూ ఈ నెల 3వ తేదీన చలో విజయవాడ (అగ్రిగోల్డ్ బాధి తుల ఆవేదన యాత్ర) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అగ్రిగోల్డ్ బాధి తుల సంఘం మండల కార్యదర్శి షమీవుల్లా ఆదివారం తెలిపారు. ఆయన ఆదివారం మండలకేంద్రంలో విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ... అగ్రిగోల్డ్ కంపెనీ చేతిలో మోసపోయి, చాలా ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. దాదాపు 11 సంవత్సరాలు అయిందన్నారు. అయితే సుదీర్ఘ పోరాటాల వలన రూ. 10వేలు నుంచి రూ. 20వేలు మాత్రమే చెల్లింపులు జరిగాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ ఆస్థులన్నీ అమ్మి డిపాజిట్ దారులకు సొమ్ము చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతున్నా ఎలాంటి పురోగతి లేదన్నారు. కావున ఈ నెల 3న అగ్రీగోల్డ్ కంపెనీ బాఽధితుల ఆవేదన యాత్ర, దీక్షలు నిర్వహిస్తు న్నామని తెలిపారు. బాధితులు చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొని తమ న్యాయ పోరాటాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగ్రీగోల్డ్ బాధితుల నియోజకవర్గ అధ్యక్షుడు హాజీ అత్తార్ మహబూబ్‌భాషా, ఉపాఽధ్యక్షుడు వెంకటేష్, ఉప కార్యదర్శి కరీ మున్నీసా, నాగభూషణ, మన్సూర్, సమ్మద్, బీబీజాన పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....