Share News

FESTIVAL: పండుగను ప్రశాంతంగా జరుపుకోండి

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:25 AM

వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవా లని డీఎస్పీ విజయ్‌కుమార్‌ వినాయక ఉత్సవ కమిటీ, పీస్‌ కమిటీలకు సూచిం చారు. ఎస్పీ వి. రత్న ఆదేశాల మేరకు ఆయన సోమవారం జిల్లా కేంద్రంలోని సాయిఆరామంలో పుట్టపర్తిటౌన, పుట్టపర్తి రూరల్‌, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాలకు చెందిన వినాయక ఉత్సవ కమిటీలు, పీస్‌ కమిటీలతో సమావేశం నిర్వహిం చారు.

FESTIVAL: పండుగను ప్రశాంతంగా జరుపుకోండి
DSP Vijaykumar speaking at Saiaram

ఉత్సవ కమిటీల సమావేశంలో పోలీసులు

పుట్టపర్తి రూరల్‌/ధర్మవరం/కదిరి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవా లని డీఎస్పీ విజయ్‌కుమార్‌ వినాయక ఉత్సవ కమిటీ, పీస్‌ కమిటీలకు సూచిం చారు. ఎస్పీ వి. రత్న ఆదేశాల మేరకు ఆయన సోమవారం జిల్లా కేంద్రంలోని సాయిఆరామంలో పుట్టపర్తిటౌన, పుట్టపర్తి రూరల్‌, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాలకు చెందిన వినాయక ఉత్సవ కమిటీలు, పీస్‌ కమిటీలతో సమావేశం నిర్వహిం చారు. సీఐలు శివాంజనేయులు, సురేష్‌కుమార్‌, ఎస్సైలు లింగన్న, కృష్ణమూర్తి అన్నిమతాల పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే ధర్మవరం డీఎస్పీ హేమంతకుమార్‌ పట్టణం లోని షిర్డీ సాయిబాబా కళ్యాణమండపంలో సోమవారం వినాయక ఉత్సవ కమిటీల సభ్యులతో సమావేశం నిర్వహించారు. వనటౌన సీఐ నాగేంద్రప్రసాద్‌, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గాండ్ల పెంట మండలకేంద్రంలో కదరి డీఎస్పీ శివనారాయణ స్వామి వినాయక ఉత్సవ కమిటీల సభ్యులతో సమావేశం నిర్వహించారు.


సీఐ నాగేంద్ర, ట్రైనీ ఎస్‌ఐ రవికుమార్‌, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు, పోలీసులు పాల్గొన్నారు. నియమ నిబంధనలను పాటిస్తూ ప్రతిఒక్కరూ వినాయక చవితి వేడుకలను శాంతియుత వాతావర ణంలో జరుపుకోవాలని సూచించారు.

ముదిగుబ్బ / నల్లచెరువు/ తనకల్లు: వినాయక చవితి వే డుకల సందర్భంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ శివరా ముడు ఆదేశాల మేరకు ఎస్‌ఐ నాగప్రసన్న అవగాహన కల్పిం చారు. మండలకేంద్రంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో హెడ్‌ కానిస్టేబుల్‌ ఠాగూర్‌, గణేష్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే నల్లచెరువు ఎస్‌ఐ మగ్బుల్‌ బాషా మండలకేంద్రంలోని పోలీస్‌ స్టేషనలో ఎంపీడీఓ రఘునాథ్‌ గుప్త, తహసీల్దార్‌ జమానుల్లాఖానతో కలిసి మండలంలోని గ్రామా ల ప్రజలతో సమావేశం నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ అబ్దుల్‌ ఖాదర్‌, మాజీ ఎంపీటీసీ శివారెడ్డి, పంతులచెరువు సర్పంచ రమ ణారెడ్డి, లక్ష్మీపతియాదవ్‌, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. తనకల్లు పోలీస్‌ స్టేషలోలో వినాయక చవితి పండుగ నిబంధన లను ఎస్‌ఐ గోపి ఉత్సవ కమిటీ సభ్యులకు వివరించారు. ఎంపీ డీఓ రామానాయక్‌, లైనమ్యాన హరి, మహిళ పోలీసులు, పోలీసులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Aug 26 , 2025 | 12:25 AM