CPI: త్వరగా కులగణన పూర్తి చేయాలి
ABN , Publish Date - Sep 30 , 2025 | 12:08 AM
రాష్ర్ట్రంలో కులగణన త్వ రగా పూర్తీచేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సాయిఅరామంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ అద్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
పుట్టపర్తి రూరల్, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ర్ట్రంలో కులగణన త్వ రగా పూర్తీచేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని సాయిఅరామంలో సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ అద్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. స మావేశానికి హాజరైన సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడు తూ... కుల గణన వీలైనంత త్వరగా రాష్ట్రంలో పూర్తిచేస్తేనే ప్రయోజనం చేకూరుతుందన్నారు. తెలంగాణాలో మాదిరి ప్రభుత్వం జనగణనకు సంబంధించి నిర్ణయం త్వరగా తీసుకోవాలని కోరారు. అంతేకాక స్థానిక సంస్థలలో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. తమ హక్కులను సాధించుకునేందుకు బీసీలు ఐక్యంగా పోరాడిల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారఽథి సీపీఐ జిలా ్లకార్యవర్గసభ్యుడు జగదీస్, వైసీపీ నాయకులు కేటీ శ్రీధర్, బీసీ సంఘాల నాయకులు సామకోటి ఆదినారాయణ, రమేష్‌డౌడ్, అంపావతిని గోవిం దు, ఏఐటీయూసీ నాయకులు అంజనేయులు, చేతివృత్తి సంఘం నాయ కులు జింకాచలపతి, రైతుసంఘం నాయకులు కాటమయ్య, నాయకులు జయచంద్రమోహన, వినోద్, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.