BUS STOP: బస్‌షెల్టర్ లేక ఇబ్బందులు
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:43 PM
మండలకేంద్రంలో బస్ షెల్టర్ లేదు. దీంతో మహిళా ప్రయాణికులు, ఉద్యోగినులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. తనకల్లులోని అంబే డ్కర్ కూడలి, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆర్టీసీ బస్సులను ఆపుతున్నారు. దీంతో మండలపరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే మహిళలతో పాటు తనకల్లులోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయినులు తమ తమ గ్రామాలకు వెళ్లే బస్సులు ఎక్కడానికి తనకల్లులోని అంబేడ్కర్ సర్కిల్‌లో వేచి ఉండాల్సి వస్తోంది.
దుకాణాల ఎదుట వేచి ఉండాల్సిన దుస్థితి
తనకల్లు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలో బస్ షెల్టర్ లేదు. దీంతో మహిళా ప్రయాణికులు, ఉద్యోగినులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. తనకల్లులోని అంబే డ్కర్ కూడలి, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆర్టీసీ బస్సులను ఆపుతున్నారు. దీంతో మండలపరిధిలోని వివిధ గ్రామాల నుంచి వచ్చే మహిళలతో పాటు తనకల్లులోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు, పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయినులు తమ తమ గ్రామాలకు వెళ్లే బస్సులు ఎక్కడానికి తనకల్లులోని అంబేడ్కర్ సర్కిల్‌లో వేచి ఉండాల్సి వస్తోంది. అయితే అక్కడ బస్ షెల్టర్ లేకపోవడంతో వారు తమ బస్సు వచ్చే వరకు రోడ్డుపైనే దుకాణాల ఎదుట నిలబడ్డాల్సి వస్తోంది. ప్రభు త్వం మహిళలకు స్ర్తీశక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తోంది.
దీంతో బస్సులన్నీ పై ప్రాంతాలైన మదనపల్లి, అం గళ్లు, గోళ్లపల్లి, బురకాయలకోట, ములకలచెరువు, కొక్కంటి క్రాస్ నుంచి పూర్తి నిండుగా వస్తుంటాయి. దీంతో డ్రైవర్లు మహిళలు వేచి ఉన్న ప్రాంతంలో కాకుండా కొద్దిగా ముందుగాని, వెనకు గానీ బస్సులను ఆపు తున్నారు. దీంతో మహిళా ప్రయాణికులు బస్సుల కోసం ఇటు, అటు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సుల కోసం దుకాణాల ఎదుట నిలబడి ఉన్న ప్రయాణికులను దుకా ణదారులు కొద్దిగా ముం దుకు జరగండి అంటున్నారు. దీంతో ప్రయాణికులు రోడ్డుపైకి రావాల్సి వస్తోంది. అయితే నడి రోడ్డులో నిలుచుకోలేక, కూర్చోవడానికి షెల్టర్ లేక వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలపైన ఆర్టీసి, పం చాయతీ, రెవెన్యూ, పోలీస్ అఽధికారులు స్పందించి బస్సు షెల్టర్ ఏర్పా టుకు కృషి చేయాలని ప్రత్యేకించి మహిళా ఉద్యోగులు కోరుతున్నారు. ఇందులో కొసమెరుపు ఏమిటంటే తనకల్లులో ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రభుత్వం నిర్మించినా, అనుకూలంగా లేదని అక్కడ బస్సులను ఆపడం లేదు. దీంత ఇక్కడి బస్టాండ్ శిథిలావస్థకు చేరుకుంటోంది.