TREES: షార్ట్ సర్క్యూట్‌తో చీనీ, అరటి చెట్ల దగ్ధం
ABN , Publish Date - Dec 19 , 2025 | 12:20 AM
మండలపరిదిలోని గం టాపురానికి చెందిన నాగేష్ అనే రైతు వ్యవసాయ తోటలో గురువా రం విద్యుత షార్టు సర్క్యూట్ జరిగి చీనీ, అరటి చెట్లు, డ్రిప్ వైరు కాలి పోయినట్లు బాధిత రైతు తెలిపారు. నాగేష్ తన పొలంలో చీనీ, అరటి పంటలు సాగు చేస్తున్నాడు. పొలంలో గురువారం ఉదయం విద్యుత షార్టు సర్క్యూట్ అవడంతో విద్యుత తీగల నుంచి అగ్ని రవ్వలు కింద పడి మంటలు వ్యాపించాయి.
బత్తలపల్లి, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): మండలపరిదిలోని గం టాపురానికి చెందిన నాగేష్ అనే రైతు వ్యవసాయ తోటలో గురువా రం విద్యుత షార్టు సర్క్యూట్ జరిగి చీనీ, అరటి చెట్లు, డ్రిప్ వైరు కాలి పోయినట్లు బాధిత రైతు తెలిపారు. నాగేష్ తన పొలంలో చీనీ, అరటి పంటలు సాగు చేస్తున్నాడు. పొలంలో గురువారం ఉదయం విద్యుత షార్టు సర్క్యూట్ అవడంతో విద్యుత తీగల నుంచి అగ్ని రవ్వలు కింద పడి మంటలు వ్యాపించాయి. గమనిం చిన రైతు ఫోన చేయగా గ్రామస్థులు అక్కడి చేరుకుని మంటలు అర్పివేశారు. ఈ ప్రమాదంలో 90 చీనీ చెట్లు, 40అరటి చెట్లు, 20కట్టల డ్రిప్ వైరు కాలిపోయినట్లు రైతు తెలిపాడు. రూ. 3లక్షల కు పైగా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.