ROAD: దారి పొడవునా కంపచెట్లు
ABN , Publish Date - Dec 10 , 2025 | 11:37 PM
మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారుల పొడవునా కంపచెట్లు ఏపుగా పెరిగి రోడ్ల పైకి వచ్చాయి. రోడ్లకు ఇరువైపులా ఇలా ఉండడంతో ఆయా గ్రామస్థు లు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మలుపుల వద్ద దారి కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు వాపోతు న్నారు.
మలుపుల వద్ద ప్రమాదాలు
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
ధర్మవరం రూరల్, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గ్రామాలకు వెళ్లే రహదారుల పొడవునా కంపచెట్లు ఏపుగా పెరిగి రోడ్ల పైకి వచ్చాయి. రోడ్లకు ఇరువైపులా ఇలా ఉండడంతో ఆయా గ్రామస్థు లు ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మలుపుల వద్ద దారి కనిపించక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వారు వాపోతు న్నారు. మండలపరిధిలోని సుబ్బరావుపేట ప్రధాన రహదారి నుంచి ఎస్సీ కాలనీ, గొట్లూరుకు వెళ్లే రహదారిలో కంప చెట్లు రోడ్డుకు అడ్డంగా పెరిగాయి. దీంతో మలుపుల వద్ద రోడ్డు కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. అదేవిధంగా తుంపర్తి నుంచి శ్మశానవాటికకు, మల్లాకాల్వకు వెళ్లే రహ దారిలో కంపచెట్లు విపరీతంగా పెరిగి వెళ్లేందుకు వీలులేకుండా ఉందని గ్రామస్థులు వాపో తున్నారు. కంపచెట్లు రోడ్డుకు అడ్డంగా పెరగడంతో ప్రయాణానికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. మలుపుల వద్ద కంపచెట్లు విపరీతంగా పెరగడంతో ద్విచక్రవాహ నాలు ఎదురె దురుగా ఢీకొని ప్రమాదాలు బారిన పడ్డామని పలువురు గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహ దారులకు అడ్డంగా పెరిగిన కంపచెట్లను తొలగించి, మలుపుల వద్ద కని పించేలా సూచికబోర్డులు, ఏర్పాటుచేయాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....