Share News

ROAD: గుంతలమయమైన రోడ్డు

ABN , Publish Date - Oct 11 , 2025 | 11:58 PM

మండలంలోని బొంతలపల్లి రహదారి నుంచి పెద్దఎద్దులవారిపల్లి, చిన్నఎద్దులవారిపల్లి, కుర్మాలపల్లి, రాగినేపల్లి, మార్పురివాండ్లపల్లి గ్రామాలకు ఐదు కిలోమీటర్ల రహదారి ఉంది. ఈ రహదారిని చాలా ఏళ్ల క్రితం ని ర్మించారు. ఆ తరువాత దానిపై అధికారులు కానీ, ప్రజాప్రతినిధు లు కానీ పిడికెడు మన్ను వేసిన పాపాన పోలేదు.

ROAD: గుంతలమయమైన రోడ్డు
Marpuriwandlapalli and Pededdula Waripalli road with potholes

- ఐదు కిలోమీటర్ల ప్రయాణానికి అరగంట

తనకల్లు, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని బొంతలపల్లి రహదారి నుంచి పెద్దఎద్దులవారిపల్లి, చిన్నఎద్దులవారిపల్లి, కుర్మాలపల్లి, రాగినేపల్లి, మార్పురివాండ్లపల్లి గ్రామాలకు ఐదు కిలోమీటర్ల రహదారి ఉంది. ఈ రహదారిని చాలా ఏళ్ల క్రితం ని ర్మించారు. ఆ తరువాత దానిపై అధికారులు కానీ, ప్రజాప్రతినిధు లు కానీ పిడికెడు మన్ను వేసిన పాపాన పోలేదు. దీంతో రో డ్డు మొత్తం గుంతలమయం అయిపోయింది. గుంతలమయమైన ఐదు కిలోమీటర్ల రహదారిలో ప్రయాణం సాగించడానికి ఆరగంటకు పైగా పడుతున్నట్లు గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా వాణిజ్య పంటలైన టమోటా, బెండ, మిరప, బెల్ట్‌ చిక్కుడు, వివిధ రకాల పూల పంటలు పండిస్తున్నా రు. ప్రతిరోజు ఈ ప్రాంతం నుంచి వివిధ వాహనాలలో రైతులు పండించిన పంటలను మార్కెట్లకు తరలిస్తున్నారు. అంతేగాకుం డా మార్పురివాండ్లపల్లి, రాగినేపల్లి, కుర్మాలపల్లి, చిన్నఎద్దులవారిపల్లిల నుంచి ప్రతిరోజు వందలాదిమంది చీకటిమానిపల్లి, కొక్కంటిక్రాస్‌, తనకల్లు, అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు వెళ్లి వ స్తుంటారు. ఈ రహదారిపై ఆటోలలో ప్రయాణం చేయాలంటే నరకయాతన అనుభవించాల్సిందేనని వారు వాపోతున్నారు. ద్విచక్రవాహన దారులు ఎవరో ఒకరు ప్రతిరోజు ఎక్కడో ఒకచోటు ఈ రోడ్డులో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ ఐదు కిలోమీటర్ల రహదారిని పునర్నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 11 , 2025 | 11:58 PM