RSK: కట్టించారు... వదిలేశారు
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:07 AM
మండలంలోని తుమ్మల గ్రామంలో ఉన్న రైతుసేవాకేంద్రాన్ని కట్టించారు. ప్రారంభించి నిరుపయో గంగా వదిలేశారు. రూ. లక్షలు నిధులు వెచ్చించి నిర్మించిన భవనంలో విధులు నిర్వర్తించకపోవడం తో... ప్రస్తుతం దాని చుట్టూ కంపచెట్లు పెరిగి ఆధ్వానంగా తయారైంది. రూ. 18లక్షలతో ప్రభుత్వం నిర్మించిన భవనాన్ని ప్రారంభించి వదిలేశారు.
ధర్మవరం రూరల్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): మండలంలోని తుమ్మల గ్రామంలో ఉన్న రైతుసేవాకేంద్రాన్ని కట్టించారు. ప్రారంభించి నిరుపయో గంగా వదిలేశారు. రూ. లక్షలు నిధులు వెచ్చించి నిర్మించిన భవనంలో విధులు నిర్వర్తించకపోవడం తో... ప్రస్తుతం దాని చుట్టూ కంపచెట్లు పెరిగి ఆధ్వానంగా తయారైంది. రూ. 18లక్షలతో ప్రభుత్వం నిర్మించిన భవనాన్ని ప్రారంభించి వదిలేశారు. ప్రభు త్వాలు లక్షల రూపాయలు వెచ్చించి భవనాలు నిర్మిస్తే వాటిని వినియో గంలోకి తీసుకురాకపోవడంతో నిధులన్నీ వృథాఅయినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. తుమ్మలలో గ్రామ సచివాలయం, రైతు సేవా కేంద్ర దగ్గరగా లేవు. దీంతో ఆ భవనాన్ని వాడుకోకుండా సచివాలయంలోనే రైతుసేవాకేంద్రం సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ కారణంగా ఆ భవనం నిరుపయోగంగా మారిందని గ్రామస్థులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే ఆ భవనాన్ని ప్రారంభించి నప్పుడు వైఎస్సాఆర్ రైతుభరోసా కేంద్రం అని బోర్డు పెట్టారు. నేటికి అదే ఉంది. ప్రభుత్వాలు మారినా కార్యాలయాలకు మాత్రం గత ప్రభుత్వాల పేర్లు ఉండటంపై గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ భవన పరిసరాలను శుభ్రం చేసి, రూ. లక్షలు వెచ్చించి నిర్మించిని భవనాన్ని వినియోగంలోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....