WATER: నిర్మించారు - వదిలేశారు
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:15 AM
మండలపరిధిలోని గోళ్లవారి పల్లి సమీపంలో ఉపాధి నిధులతో పశువుల దాహార్తిని తీర్చడానికి నీటి తొట్టెలు నిర్మించారు. అయితే నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ తరువాత తన కేమీ సంబంధం లేదని అలాగే వదిలేశారు. మరి ఆ తొట్టెలకు నీటి సౌకర్యం ఎవరు కల్పిస్తారో తెలియక పశువుల కాపర్లు ఇబ్బందులు పడుతున్నారు.
తనకల్లు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని గోళ్లవారి పల్లి సమీపంలో ఉపాధి నిధులతో పశువుల దాహార్తిని తీర్చడానికి నీటి తొట్టెలు నిర్మించారు. అయితే నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ తరువాత తన కేమీ సంబంధం లేదని అలాగే వదిలేశారు. మరి ఆ తొట్టెలకు నీటి సౌకర్యం ఎవరు కల్పిస్తారో తెలియక పశువుల కాపర్లు ఇబ్బందులు పడుతున్నారు. తమ కోరిక మేరకు పశువుల తొట్టెలు నిర్మించిన అధికారులు తరువాత వాటలో నీటిని నింపడం మరిచారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అఽధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వివిధ గ్రామాల్లో నిర్మించిన పశువుల నీటి తొట్టెలు వృథాకాకుండా నీటితో నింపి, పశువుల దాహార్తి తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.