MUSLIMS: షాదీమహల్ నిర్మించండి
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:15 AM
పట్టణంలోని మైనార్టీల కోసం షాదీమహల్ నిర్మించాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్‌కు ముస్లిం నాయకులు విజ్ఞప్తిచేశారు. వారు బుధవారం పట్టణం లోని టీడీపీ కార్యాలయంలో పరిటాల శ్రీరామ్‌ను కలిశారు. వారి విజ ్ఞప్తి మేరకు ఆయన పోతుకుంట వద్ద ఈద్గా మైదానాన్ని పరిశీలించారు. త్వరలో ఎంపీ బీకే పార్థసారఽథిని కలిసి ఎంపీ ఫండ్స్ ద్వారా షాదీ మహల్ నిర్మించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు.
పరిటాల శ్రీరామ్‌కు ముస్లింల వినతి
ధర్మవరం, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మైనార్టీల కోసం షాదీమహల్ నిర్మించాలని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్‌కు ముస్లిం నాయకులు విజ్ఞప్తిచేశారు. వారు బుధవారం పట్టణం లోని టీడీపీ కార్యాలయంలో పరిటాల శ్రీరామ్‌ను కలిశారు. వారి విజ ్ఞప్తి మేరకు ఆయన పోతుకుంట వద్ద ఈద్గా మైదానాన్ని పరిశీలించారు. త్వరలో ఎంపీ బీకే పార్థసారఽథిని కలిసి ఎంపీ ఫండ్స్ ద్వారా షాదీ మహల్ నిర్మించేందుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం మైనార్టీల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు. మరో వైపు పట్టణంలని బాలికల ఉన్నతపాఠశాల పాఠశాలలో సమస్యలను పరిటాలశ్రీరామ్ దృ ష్టికి తీసుకురాగా ఆయన నేరుగా పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. ము ఖ్యంగా అక్కడ నిర్మించిన సభావేదిక రావిచెట్టు ఊడలుదిగి కూలేందుకు సిద్ధంగా ఉందని ఉపాధ్యాయులు ఆయన దృష్టికితెచ్చారు. అలాగే రెండు గదులు మరమ్మతులకు వచ్చాయని, వంట చేసేందుకు సౌకర్యాలు లేవ ని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నూతన గదుల నిర్మాణానికి కృ షిచేస్తానని ఆయన అన్నారు. అలాగే పాఠశాలలో 617 మంది విద్యార్థు లు ఉన్నారని, ఇటీవల చాలా మంది విద్యార్థినుల హాజరు శాతం తగ్గు తోందని హెచఎంతెలిపారు. హాజరుశాతం తగ్గడానికి కారణాలు తెలుసు కోవాలని పరిటాలశ్రీరామ్ సూచించారు. అవసరమైతే త్వరలో ఎమ్మెల్యే పరిటాల సునీతను పాఠశాలకు ఆహ్వానించి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అడ్యక్షుడు పరిశే సుధాకర్, మదీన మసీదు ముతవల్లి నాగూర్‌హుస్సేన, ముస్లిం మైనార్టీ నాయకులు రాళ్లపల్లి షరీఫ్, అత్తర్ రహీంబాషా, అస్లాం, పఠాన బాబుఖాన, షామీర్, ఇర్షాద్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....