ICDS: ముగిసిన తల్లిపాల వారోత్సవాలు
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:16 AM
తల్లిపాల వారోత్సవాలు గురు వారంతో ముగిశాయి. పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాల యంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. సీడీపీఓ రాధిక మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తాగించాలని, ముర్రు పాలు బిడ్డకు మొదటి టీకా అన్నారు. బిడ్డ ఆరునెలల వయస్సు వరకు తల్లిపాలు తాగించాలన్నారు.
కదిరి, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): తల్లిపాల వారోత్సవాలు గురు వారంతో ముగిశాయి. పట్టణంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాల యంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. సీడీపీఓ రాధిక మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తాగించాలని, ముర్రు పాలు బిడ్డకు మొదటి టీకా అన్నారు. బిడ్డ ఆరునెలల వయస్సు వరకు తల్లిపాలు తాగించాలన్నారు. రెండేళ్ల వరకు అదనపు ఆహారంతో తల్లిపాలు ఇవ్వాలన్నారు. బిడ్డలకు రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. సూపర్‌వైజర్లు నిహారి, లక్ష్మీదేవి, దీపకళావతి, జయశ్రీ, నరసమ్మ, మమత, అంగనవాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
గాండ్లపెంట: మండలంలోని సోమయాజులపల్లి పంచాయ తీ అంగనవాడీ కేంద్రంలో గురువారం తల్లిపాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని సూపర్‌వైజర్ పద్మావతమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. తల్లిపాల ప్రాముఖ్యతపై ర్యాలీ నిర్వహించారు. అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు, తల్లులు పాల్గొన్నారు
తనకల్లు: తల్లి పాలు బిడ్డకు అమృతమని ఐసీడీఎస్ సూ పర్‌వైజర్ లక్ష్మీదేవమ్మ పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాల ము గింపు సందర్భంగా మండలంలోని టి.సదుం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాఽధ్యాయులు మురళీధర్ రావు, మహిళ పోలీస్, వైద్య సిబ్బం ది, అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....