DEITiES: గ్రామదేవతలకు బోనాలు
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:50 PM
మండల పరిధిలోని మలక వేముల పంచాయతీ ఎనుములవారిపల్లి ఎస్సీ కాలనీ వాసులు ఆదివారం గ్రామదేవతలకు జ్యోతులు, బోనాలు సమర్పించారు. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామదేవత లైన గంగమ్మ, పెద్దమ్మ, నల్లలమ్మ, సప్పలమ్మ, ధూమమ్మ జ్యోతులు, బో నాలు నైవేద్యం పెట్టి గ్రామస్థులు పూజలు నిర్వహించారు.
ముదిగుబ్బ, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని మలక వేముల పంచాయతీ ఎనుములవారిపల్లి ఎస్సీ కాలనీ వాసులు ఆదివారం గ్రామదేవతలకు జ్యోతులు, బోనాలు సమర్పించారు. ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా ఘనంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామదేవత లైన గంగమ్మ, పెద్దమ్మ, నల్లలమ్మ, సప్పలమ్మ, ధూమమ్మ జ్యోతులు, బో నాలు నైవేద్యం పెట్టి గ్రామస్థులు పూజలు నిర్వహించారు. గ్రామస్థులు డప్పు వాయిద్యాలతో వైభవంగా బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మ వార్లకు సమర్పించారు. మహిళలు గ్రామదేవతలకు ఒడిబియ్యం, గాజులు, చీరలు, పూలదండలు, నిమ్మకాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఓబుళదేవరచెరువు: మండలకేంద్రమైన ఓబుళదేవర చెరువు, మం డలంలోని ఆకుతోట పల్లి, గౌనిపల్లి ఎస్సీ కా లనీల్లో ఆదివారం గ్రా మ దేవత గంగమ్మకు ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ సం దర్భంగా ఆయా ఆల యాల్లో అమ్మవారి విగ్ర హాన్ని నూతన వస్ర్తా లు, పూలమా లలతో అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....