JC: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య : జేసీ
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:29 AM
ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన విద్యను అందిస్తున్నాయని, ఉపాధ్యాయులు సమన్వయంతో బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ పేర్కొన్నారు. పట్టణంలోని కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నతపాఠశాలలో ఏర్పాటుచేసిన మెగా పీటీ ఎం సమావేశానికి జేసీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ధర్మవరం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలు మెరుగైన విద్యను అందిస్తున్నాయని, ఉపాధ్యాయులు సమన్వయంతో బాధ్యతగా విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాయింట్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్ పేర్కొన్నారు. పట్టణంలోని కొత్తపేట మున్సిపల్ బాలికల ఉన్నతపాఠశాలలో ఏర్పాటుచేసిన మెగా పీటీ ఎం సమావేశానికి జేసీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జేసీతో పాటు స్థానిక ఆర్డీఓ మహేశ, ఎంఈఓ-1 రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ...ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం విద్యార్థుల ఎదుగుదలకు ఒక వేదికగా తయారైందన్నారు. ఉపాధ్యాయులు సమన్వయంతో సమానమైన విద్యను బోధించాలని, క్రమవిక్షణతో కూడిన చదువు విద్యార్థులకు ఎంతో అవసరమన్నా రు. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపట్ల సహకారం అందించాలన్నారు. అనంతరం బాల్య వివాహం చేసుకోరాదని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో పాఠశాల హెచఎం రాంప్రసాద్, పాఠశాల కమిటీ చైర్మన శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పీటీఎం కార్యక్రమాన్ని నిర్వహించారు.