Share News

TDP : కూటమి ప్రభుత్వంలో బీసీలకు పెద్ద పీట

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:10 AM

కూటమి ప్రభుత్వం బీసీ లకు పెద్ద పీట వేస్తోంద ని టీడీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణ య్య పేర్కొన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం పద్మశాలి కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్‌ పో తుల లక్ష్మీనరసింహులు, టీడీపీ నాయకులు చండ్రాయుడుతో కలిసి ఆ య న మీడియాతో మాట్లాడారు.

TDP : కూటమి ప్రభుత్వంలో బీసీలకు పెద్ద పీట
Avula Krishnaiah speaking to the media

- టీడీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణయ్య

అనంతపురం అర్బన, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం బీసీ లకు పెద్ద పీట వేస్తోంద ని టీడీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆవుల కృష్ణ య్య పేర్కొన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం పద్మశాలి కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్‌ పో తుల లక్ష్మీనరసింహులు, టీడీపీ నాయకులు చండ్రాయుడుతో కలిసి ఆ య న మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో బీసీలకు పెద్ద పీట వేశారన్నారు. వైసీపీ పాలనలో బీసీలను కే వలం ఓటు బ్యాంక్‌గా వాడుకున్నారని మండిపడ్డారు. దేశంలోనే తొలి సారిగా కూటమి ప్రభుత్వం బీసీల రక్షణ చట్టం తీసుకొస్తు న్నందుకు బీసీలంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. పోతుల లక్ష్మీన రసింహులు మాట్లాడుతూ.... ఫీజు పోరు పేరుతో వైసీపీ చేస్తున్న డ్రామాను విద్యార్థులు గమనిస్తున్నారన్నారు. నగర సమీపంలోని డంపింగ్‌ యార్డు తరలింపుతో పాటు నడిమి వంక, మరువ వంకల ప్రొటెక్షన వాల్స్‌ ఏర్పాటు విషయాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ అసెంబ్లీలో ప్రస్తావించ డాన్ని నగర ప్రజలంతా స్వాగతిస్తున్నారన్నారు. నగర అభివృద్ధికి ఎమ్మెల్యే పాటుపడుతుంటే వైసీపీ నాయకులు ఓర్వలేక అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.


వైసీపీ కుట్రలను బద్దలు కొడతాం : సిమెంట్‌ పోలన్న

అనంతపురం అర్బన, మార్చి 10(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలు, కుట్రలను బద్దలు కొడతామని టీడీపీ నాయకు డు సిమెంట్‌ పోలన్న హెచ్చరించారు. ఆయన సోమవారం టీడీపీ జిల్లా కా ర్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే దగ్గుపాటిప్రసాద్‌ అనంతపురం అర్బన అభివృద్ది కోసం పాటుపడుతున్నారని కొనియాడారు. దీన్ని జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలనే కుట్రలు చేయడం సిగ్గుచేటన్నారు.

ఎమ్మెల్సీ పదవులు బీసీలకు ఇవ్వడం హర్షణీయం

బుక్కరాయసముద్రం, మార్చి10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ పదవులు బీసీలకు ఇవ్వడం హర్షణీయమని తెలుగుయువత నియోజక వర్గం ప్రధాన కార్యదర్శి నరేంద్రయాదవ్‌, బీసీ సంఘం నేతలు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో వారు సోమవా రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టీడీపీ బీసీలకు పెద్ద పీట వేస్తోందని చెప్పడానికి ఎమ్మెల్సీల కేటాయింపే నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు లక్ష్మీనారాయయాదవ్‌, ఆదియాదవ్‌, బొజ్జయ్య, రామకృష్షరాజు, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 11 , 2025 | 12:10 AM