GOD: అయ్యప్పస్వామి గ్రామోత్సవం
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:14 AM
మండల కేంద్రంలో అయ్యప్పస్వామి గ్రామోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించా రు. అయ్యప్పస్వామి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠలో భాగంగా నాలుగో రోజు అయ్యప్పస్వామి పంచలోహ విగ్రహం, వినాయకుడు తదితర విగ్రహాలను ఊరేగించా రు.
గాండ్లపెంట, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో అయ్యప్పస్వామి గ్రామోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించా రు. అయ్యప్పస్వామి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ఠలో భాగంగా నాలుగో రోజు అయ్యప్పస్వామి పంచలోహ విగ్రహం, వినాయకుడు, సురబ్రహ్మణ్యేశ్వరస్వామి, శివలింగం, నందీశ్వరుడు, హంసవాహనం, మూషికవాహనం తదితర విగ్రహాలను చిన్నమిట్ట అయ్యప్పస్వామి ఆలయం నుంచి మండల కేంద్రంలో ఊరేగించా రు. మండలంలోని అయ్యప్పస్వామి భక్తులు పాల్గొన్నారు. గాండ్ల పెంట ఎస్‌ఐ క్రాంతి కుమార్ పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.