GOD: ఘనంగా ఆయ్యప్పస్వామి కన్నెపూజ
ABN , Publish Date - Nov 27 , 2025 | 11:41 PM
జిల్లాకేంద్రంలో హను మాన దేవాలయం లో మొదటిసారి అయ్యప్ప మాలధారణ చేసిన వారు గురువారం కన్నెపూజను ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే గణపతి, నవగ్రహ పూజ, గణపతిహోమం చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయ్యప్పస్వాములకు ప్రత్యేకపూజలు నిర్వహించారు.
పుట్టపర్తి రూరల్, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలో హను మాన దేవాలయం లో మొదటిసారి అయ్యప్ప మాలధారణ చేసిన వారు గురువారం కన్నెపూజను ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే గణపతి, నవగ్రహ పూజ, గణపతిహోమం చేశారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయ్యప్పస్వాములకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛార ణ మధ్య కన్నెస్వాములు తెల్లవారుజామునే భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం మాలధారుల దీక్ష, అన్నదానం, సాయం త్రం ఆయ్యప్పస్వామి విగ్రహం ఊరేగింపు చేపట్టారు. దాతల సహకారం తో అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు గురుస్వామి పుట్టణ్ణ తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....