divotional :కన్నుల పండువగా అయ్యప్ప నగరోత్సవం
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:18 AM
స్థానిక మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయ ఆవరణలోని అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగం గా శనివారం సాయంత్రం స్వామివారి నగరోత్సవాన్ని కన్నులపండువగా జరిపారు.
అనంతపురం టౌన, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): స్థానిక మొదటిరోడ్డు కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయ ఆవరణలోని అయ్యప్పస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగం గా శనివారం సాయంత్రం స్వామివారి నగరోత్సవాన్ని కన్నులపండువగా జరిపారు.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన రథంలో స్వామివారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి ప్రత్యేక అలంకరణలు, విశేష పూజలు చేశారు. అనంతరం మొదటిరోడ్డుతో పాటు రెండో రోడ్డు, మూడో రోడ్డు మీదుగా నగరోత్సవాన్ని నిర్వహించారు. నగరోత్సవం ముందు అయ్యప్పమాలధారుల, భక్తులు స్వామివారి భక్తిగీతాలాపనలు చేస్తూ, పేటతుళ్లై ఆడుతూ భక్తితన్మయత్వంతో ముందు కు సాగారు. అలాగే పలువురు కళాకారులు వేషధారణలతో అలరించగా దేవరకొండ కౌసల్య బృందం సభ్యులు నృత్యకోలాటం ప్రదర్శించారు. రాత్రికి ఆలయ ఆవరణలో మాలధారులతో పాటు భక్తులకు అల్పాహారం అందజేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ లక్ష్మిరెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి మాజీ చైర్మన సోమర జయచంద్రనాయుడు, భక్తులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..