Share News

EYE CAMP: కంటిపై అవగాహన కల్పించాలి : కలెక్టర్‌

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:46 PM

గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగా హన కల్పించాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ వైద్య సిబ్బందికి సూ చించారు. మండల కేంద్రంలోని సీహెచసీలో ఉచిత కంటి స్ర్కీనింగ్‌ శిబిరాన్ని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం ప్రారంభిం చారు. అనంతరం వారు మాట్లాడుతూ... గ్రామీణుల కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఈ వైద్యశిబిరాలను నిర్వహిస్తోందన్నారు.

EYE CAMP: కంటిపై అవగాహన కల్పించాలి : కలెక్టర్‌
Collector undergoing eye tests

కొత్తచెరువు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతా ల్లోని ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగా హన కల్పించాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ వైద్య సిబ్బందికి సూ చించారు. మండల కేంద్రంలోని సీహెచసీలో ఉచిత కంటి స్ర్కీనింగ్‌ శిబిరాన్ని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం ప్రారంభిం చారు. అనంతరం వారు మాట్లాడుతూ... గ్రామీణుల కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ఈ వైద్యశిబిరాలను నిర్వహిస్తోందన్నారు. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసు కోవాలని సూచించారు. చాలా మంది గ్రామీణులు కంటి జబ్బులతో ఇబ్బందులు పడుతున్నారని, వారిని దృష్టిలో ఉంచుకుని ఒక ప్రక్క ప్రభుత్వం, మరోపక్క స్వ చ్ఛంద సంస్థలు ఉచిత కంటి వైద్యశిబిరాలను నిర్వహిస్తుండడం అ భినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచఓ ఫైరోజ్‌బేగం, డీసీహెచఎస్‌ డాక్టర్‌ మధుసూదన, డీసీఎంఓలు డాక్టర్‌ అనూరాధ, అశ్వత్థకుమార్‌, డీఐఓ డాక్టర్‌ సురేశబాబు, శంకర నేత్రాలయ వైద్యు లు, సిబ్బంది, ఆస్పత్రి కమిటీ సభ్యులు మాజీ ఎంపీపీ వాణి, ఒలిపి శీన, సాలక్కగారి శ్రీని వాసులు, నాయకులు లక్ష్మీనారాయణ, టీడీ పీ మండల కన్వీనర్‌ రామకృష్ణ, నాగేంద్ర ప్రసాద్‌, సింగిల్‌విండో అ ధ్యక్షుడు హరిప్రసాద్‌, నల్లమాడ శంకర్‌, సూర్యప్రకాశ పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 06 , 2025 | 11:46 PM