Share News

MVI: రహదారి భద్రతపై అవగాహన

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:55 PM

పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఆదివారం మోటార్‌ వెహికల్‌ ఇనస్పెక్టర్‌ వరప్ర సాద్‌ కదిరి పట్టణంలోని వాహనాల యజమానులకు, డ్రైవర్లకు రహదా రి భద్రత నిబంధనలపై అవగాహన క్యార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐపై మాట్లాడుతూ... రహదారి సూచనలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు.

MVI: రహదారి భద్రతపై అవగాహన
MVI is creating awareness among motorists

కదిరి, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో ఆదివారం మోటార్‌ వెహికల్‌ ఇనస్పెక్టర్‌ వరప్ర సాద్‌ కదిరి పట్టణంలోని వాహనాల యజమానులకు, డ్రైవర్లకు రహదా రి భద్రత నిబంధనలపై అవగాహన క్యార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవీఐపై మాట్లాడుతూ... రహదారి సూచనలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. అలాగే వాహనాలను ఎలా కండీషనలో పెట్టుకుంటామో అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకో వాల న్నారు. ఇందులో భాగంగానే కదిరి పట్టణంలోని రోటరీ క్లబ్‌ వారి సహ కారంతో విజన ప్లస్‌ కంటి ఆసుపత్రి వారు వాహనదారులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ డీఎస్‌ఎం వరప్రసాద్‌, ఏఎంవీఐ రాజేష్‌, రోటరీ క్లబ్‌ సభ్యులు డాక్టర్‌ మదనకుమార్‌, కిషోర్‌ కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, నామా రాఘవా, రాఘవ, రాజశేఖర్‌రెడ్డి, మట్ట రాజీవ్‌, మహేష్‌రెడ్డి, విజన ప్లస్‌ కంటి ఆస్పత్రి సిబ్బంది మాధవరెడ్డి, జవహార్‌ బాషా, స్థానిక లారీ, ఆటో, ఎల్‌ జీవీ అసోసియేషన సభ్యులు సుమారు 200 మంది దాకా పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2025 | 11:55 PM