Share News

AD: మల్బరీ రైతులకు అవగాహన

ABN , Publish Date - Nov 21 , 2025 | 12:13 AM

మండలపరిధిలోని మం డ్లిపల్లి మిట్ట వద్ద రైతు రామిరెడ్డి సాగుచేసిన మల్బరీ తోటలో మ ల్బరీ సాగుచేసే రైతులకు సెరికల్చర్‌ ఏడీ వెంకట స్వామినాయక్‌ గురువారం అవగాహన కల్పించారు. ఎకరం మల్బరీ సాగుకు సాధారణ రైతులకు ప్రభుత్వం రూ.22,500, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.27వేల సాయం అందిస్తోందన్నారు. ఐదెకరాల వరకు ప్రభు త్వం సబ్సిడీ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు

AD: మల్బరీ రైతులకు అవగాహన
AD inspecting a mulberry plantation at Mandlipally

మండ్లిపల్లి వద్ద మల్బరీ తోటను పరిశీలిస్తున్న ఏడీ

తనకల్లు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని మం డ్లిపల్లి మిట్ట వద్ద రైతు రామిరెడ్డి సాగుచేసిన మల్బరీ తోటలో మ ల్బరీ సాగుచేసే రైతులకు సెరికల్చర్‌ ఏడీ వెంకట స్వామినాయక్‌ గురువారం అవగాహన కల్పించారు. ఎకరం మల్బరీ సాగుకు సాధారణ రైతులకు ప్రభుత్వం రూ.22,500, ఎస్సీ, ఎస్టీ రైతులకు రూ.27వేల సాయం అందిస్తోందన్నారు. ఐదెకరాల వరకు ప్రభు త్వం సబ్సిడీ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. టైప్‌ -1 షెడ్‌ నిర్మా ణానికి సాధారణ రైతులకు రూ.3,37,500, ఎస్సీ,ఎస్టీలకు రూ.4.05 లక్షలు, టైప్‌-2 షెడ్‌ నిర్మాణానికి సాధారణ రైతులకు రూ.2.25 లక్షలు, ఎస్టీ,ఎస్సీలకు రూ.2.70లక్షలను ప్రభుత్వం సాయం చేస్తున్న ట్లు వివరించారు. కదిరి ప్రాంతంలోని ఓబుళదేవరచెరువులోని కుటాగుళ్ల, తనకల్లు మండలంలోని మండ్లిపల్లి వద్ద సీఆర్సీ సెంటర్లు (సెరికల్చర్‌ రేరింగ్‌) నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తిగల రైతులు సిరికల్చర్‌ సాగుకు ముందుకురావాలని కోరారు. సెరికల్చర్‌ అధికారి మస్తాన, మండ్లిపల్లి, కోటూరు, పరాకువాండ్లపల్లి, తనకల్లు, రాచువారిపల్లి గ్రామాల రైతులు, సీఆర్‌పీ నిర్వాహకులు మండ్లిపల్లి భాస్కర్‌రెడ్డి, సెరికల్చర్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Nov 21 , 2025 | 12:13 AM