ఎడారీకరణను నివారిస్తాం
ABN , Publish Date - Feb 26 , 2025 | 12:50 AM
జిల్లాలో విస్తరిస్తున్న ఎడారీకరణను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో మంగళవారం హామీ ఇచ్చారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోయే ప్రాంతమని, కాలవ శ్రీనివాసులు శాసనసభ్యుడిగా ప్రాతినిఽథ్యం వహించే రాయదుర్గంలో ఎడారిగా మారిపోయే ఆనవాళ్లు ఉన్నాయన్నారు. ఎడారిగా ...

అసెంబ్లీలో సీఎం హామీ
రాయదుర్గం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): జిల్లాలో విస్తరిస్తున్న ఎడారీకరణను నియంత్రించేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో మంగళవారం హామీ ఇచ్చారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోయే ప్రాంతమని, కాలవ శ్రీనివాసులు శాసనసభ్యుడిగా ప్రాతినిఽథ్యం వహించే రాయదుర్గంలో ఎడారిగా మారిపోయే ఆనవాళ్లు
ఉన్నాయన్నారు. ఎడారిగా మారిపోకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యల కోసం నిధులు కేటాయించి నివారించే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. దేశంలోనే తక్కువ వర్షపాతం కురిసే జిల్లా అనంతపురం అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థలో ఐదవ జిల్లాగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఒకటో రెండో స్థానానికి చేరుకుంటుందన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....