Share News

TDP: అట్టహాసంగా శ్రీరామ్‌ జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:25 AM

టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ జన్మదిన వేడుకల ను ఆ పార్టీ నాయకులు సోమవారం పట్టణం లో వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు. ముందుగా గాంధీనగర్‌ శివాలయంలో పరి టాల శ్రీరామ్‌ పేరిట ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం టీడీపీ గాంధీనగర్‌ కార్యాలయంలో కేక్‌కట్‌ చేశారు. అక్కడే ము స్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

TDP: అట్టహాసంగా శ్రీరామ్‌ జన్మదిన వేడుకలు
TDP leaders cutting cake in front of TDP Erragunta office

ధర్మవరం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి):ఽ టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ జన్మదిన వేడుకల ను ఆ పార్టీ నాయకులు సోమవారం పట్టణం లో వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు. ముందుగా గాంధీనగర్‌ శివాలయంలో పరి టాల శ్రీరామ్‌ పేరిట ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం టీడీపీ గాంధీనగర్‌ కార్యాలయంలో కేక్‌కట్‌ చేశారు. అక్కడే ము స్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఎన్టీఆర్‌ సర్కిల్‌లో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అన్న క్యాంటీనలలో అ న్నదానంతో పాటు స్వీట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వాస్పత్రిలో పండ్లు, బ్రెడ్డు పంపిణీచేశారు. షిర్డీసాయిబాబా ఆలయంలో అన్నదానం చేపట్టా రు. అనంతరం టీడీపీ ఎర్రగుంట కార్యాలయంలో ఏర్పాటుచేసిన భారీ కేక్‌ను చేనేత ప్రముఖులు, టీడీపీ నాయకులు సంధారాఘవ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేశారు. పెద్ద ఎత్తున అన్నదానం చేపట్టారు. అదేవిధంగా 25వ వార్డులో ఆ వార్డు ఇనచార్జ్‌ భీమనేని ప్రసాద్‌నాయుడు ఆధ్వర్యంలో బ్రహ్మంగారు, గంగమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజ లు చేయించి, అక్కడే కేక్‌కట్‌ చేశారు. ప్రాథమిక పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలను తొలగించి, మొక్కలు నాటారు.


యాదవ వీధిలో 23వ వార్డు ఇనచార్జ్‌ అడ్ర మహేశ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చీరలను పంపణీ చేశారు. 26వ వార్డులో ఉచిత వైద్యశిబి రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నా యకులు కమతం కాటమయ్య, చింతలపల్లి మహేశచౌదరి, ఫణికుమార్‌, పరిశే సుధాకర్‌, సంధా రాఘవ, నాగూర్‌ హుస్సేన, పురుషోత్తంగౌడ్‌, భీమనేని ప్రసాద్‌నాయుడు, చింతపులుసు పెద్దన్న, మాధవరెడ్డి, జింకా పురు షోత్తం, కొత్తపేట ఆది, రాళ్లపల్లి షరీఫ్‌, అంబటి సనత, గుడిపాటి చంద్ర, శీలామూర్తి, చట్టా లక్ష్మీనారాయణ, బొట్టు కిష్ట, జింకల రాజన్న, అస్లాం, మాదన సు బ్బయ్య, గుడిపాటి కిశోర్‌, భాస్కర్‌చౌదరి, కేశగాళ్ల శీన, పల్లెం క్రిష్ణ, కరెంటు ఆది, అడ్ర మహేశ, టైలర్‌ గోపాల్‌, రావులచెరువు కుళ్లాయప్ప, మార్కెట్‌ రహీం, జిలకర శీన, పూజా మొబైల్‌ సాయి, అంగజాల చిన్నవీరప్ప, లింగప్ప, గవ్వల నారాయణస్వామి, చీమల రామాంజి, గడ్డం సూరి, రాంపురం శీన, గంగారపు రవి, చీమల నాగరాజు పాల్గొన్నారు. అలాగే ధర్మవరం రూరల్‌, బత్తలపల్లి, ముదిగుబ్బ, తాడిమర్రి మండలాల్లో పరిటాల శ్రీరామ్‌ జన్మదిన వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Sep 23 , 2025 | 12:25 AM