TDP: అట్టహాసంగా ‘పల్లె’ జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:04 AM
మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం జన్మదిన వేడుకలను అభిమానుల మధ్య అట్టహాసంగా జరుపుకున్నారు. పలువురు పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతి నిధులు, అదికారులు, ఉద్యోగులు, వ్యాపారులు, యువత, ఆటో డ్రైవర్లు, రా జకీయ నాయకులు భారీ పూలమాలలు, కేక్‌లను పట్టణంలోని పల్లె క్యాం పు కార్యాలయానికి తీసుకెళ్లి ఆయనను ఘనంగా సన్మానించారు.
పుట్టపర్తి రూరల్, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి గురువారం జన్మదిన వేడుకలను అభిమానుల మధ్య అట్టహాసంగా జరుపుకున్నారు. పలువురు పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతి నిధులు, అదికారులు, ఉద్యోగులు, వ్యాపారులు, యువత, ఆటో డ్రైవర్లు, రా జకీయ నాయకులు భారీ పూలమాలలు, కేక్‌లను పట్టణంలోని పల్లె క్యాం పు కార్యాలయానికి తీసుకెళ్లి ఆయనను ఘనంగా సన్మానించారు. అంతకు మునుపు అనంతపురం నుంచి పుట్టపర్తికి చేరుకున్న మాజీ మంత్రి స్థానిక సత్యమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
స్థానిక హనుమాన కూడలిలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై క్రేన సాయంతో ఆయనను భారీ గజమాలలతో సన్మా నించి, భారీకేక్ కట్‌చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా, నియోజకవర్గం నుంచి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీస్థాయిలో పల్లె క్యాంపు కార్యాలయానికి తరలివచ్చారు. వారికి మాజీమంత్రి భోజన వసతి, తేనేటి విందు ఏర్పాటుచేశారు. కూటమి నాయకులు రామాంజి నేయులు, విజయ్ కుమార్, మల్‌రెడ్డి, జయచంద్ర, మైలే శంకర్, గోపాల్‌రెడ్డి, సామకోటి ఆ దినారాయణ, రామారావు, లక్ష్మీపతి, గంగాధర్‌నాయుడు, ఓబులేసు, శ్రీరాం రెడ్డి, పుల్లప్ప, ఒలిపి శ్రీనివాసులు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు,
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....