MLA: మహిళా సాఽధికారతలో ఏపీ ఆదర్శం
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:03 AM
మహిళల ఆర్థిక సాధికారతలో ఆంధ్రప్రదేశ దేశానికి ఆదర్శంగా నిలు స్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. తిరుప తిలో జరిగిన రెండు రోజుల జాతీయ పార్ల మెంటరీ శాసనసభ కమిటీల తొలిమహిళా జా తీయ సదస్సు ముగింపు సందర్భంగా సోమ వారం ఆమె మాట్లాడారు. తిరుపతిలో మహిళా సాధికారతపై తీర్మానం ఆమోదించడం చరి త్రా త్మకం అన్నారు.
ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి
పుట్టపర్తి రూరల్, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థిక సాధికారతలో ఆంధ్రప్రదేశ దేశానికి ఆదర్శంగా నిలు స్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పేర్కొన్నారు. తిరుప తిలో జరిగిన రెండు రోజుల జాతీయ పార్ల మెంటరీ శాసనసభ కమిటీల తొలిమహిళా జా తీయ సదస్సు ముగింపు సందర్భంగా సోమ వారం ఆమె మాట్లాడారు. తిరుపతిలో మహిళా సాధికారతపై తీర్మానం ఆమోదించడం చరి త్రా త్మకం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం వివిధ రంగాల్లో మ హిళల చేర్పులో ముందంజలో ఉందని ఆమె తెలిపారు. వివిధ రంగాల్లో మహిళల పెట్టుబ డులతో ఆపారమైన మానవ వనరులను వెలికి తీయ గలమని అన్నారు. ఈ సందర్భంగా పలు రాషా్ట్రల మహిళా ప్రజాప్రతినిధులతో పల్లె సిం ధూరరెడ్డి చర్చించారు. కేరళలో పుట్టి పెరిగి ప్రస్తుతం పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల తరఫు న అసెంబ్లీలో గళమెత్తుతున్న సింధూర రెడ్డిని వారు ప్రత్యేకంగా అభినందించారు. అసెంబ్లీలో ఎమ్యెల్యే చేసిన ప్రసంగాలు సోషల్‌మీడియాలో చూసిన కేరళ మహిళా ప్రతినిధులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....