Share News

Murali Naik: ముగిసిన మురళీ నాయక్ అంత్యక్రియలు.. స్పందించిన సీఎం చంద్రబాబు..

ABN , Publish Date - May 11 , 2025 | 04:55 PM

Murali Naik: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ - పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారంగా దాయాది దేశం పాకిస్థాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది.

Murali Naik: ముగిసిన మురళీ నాయక్ అంత్యక్రియలు.. స్పందించిన సీఎం చంద్రబాబు..

అమరావతి, మే 11: దేశ సరిహద్దుల్లో వీర మరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు సత్యసాయి జిల్లాలోని కళ్లితండాలో ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. వీర జవాన్ మురళీ నాయక్‌కు అంతిమ వీడ్కోలు పలుకుతున్నాను. ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది.


అమర వీరుడు మురళీనాయక్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం ఇస్తాం. 5 ఎకరాల సాగుభూమితో పాటు... 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. మురళీ నాయక్ నేడు మన మధ్య లేకపోయినా.... ఆయన దేశం కోసం చేసిన త్యాగం ఎప్పుడూ స్ఫూర్తి రగిలిస్తునే ఉంటుందని తెలుపుతూ నివాళి ఘటిస్తున్నానని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.


ఇక ఏపీ ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా కళ్లితండాకు చెందిన వీరజవాన్ మురళీ నాయక్ గారి భౌతికకాయానికి అశ్రునివాళులు అర్పించాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశాను. అగ్నివీర్ మురళీ నాయక్ ఋణం తీరనిది.జైహింద్ అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

lokesh.jpg


పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ - పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకున్నాయి. ఈ నేపథ్యంలో ఆపరేషన్‌ సిందూర్‌కు ప్రతీకారంగా దాయాది దేశం పాకిస్థాన్ సైన్యం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. ఆ క్రమంలో క్షిపణులు, డ్రోనులను భారత్‌‌లోని సరిహద్దు రాష్ట్రాలే లక్ష్యంగా ప్రయోగించింది. వీటిని భారత్ సైనిక బలగాలు ఎక్కడికక్కడ కూల్చేశాయి. అయితే జమ్మూ కాశ్మీర్‌ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ మరణించారు.


ఆతడి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మురళీ నాయక్ మృతి పట్ల వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీ నాయక్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక మురళీ నాయక్ కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్ గ్రేషియాతోపాటు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే 300 గజాల భూమి సైతం ఆ కుటుంబానికి ఇస్తామని ప్రభుత్వం వెల్లడించింది. మురళీ నాయక్ అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. అతడి పార్థీవ దేహాన్ని మంత్రి లోకేశ్ మోశారు.

ఇవి కూడా చదవండి..

Operation Sindoor: ప్రధాని మోదీ అధ్యక్షతన కీలక భేటీ..

India Vs Pakistan: ప్రధాని మోదీకి రాహుల్ కీలక సూచన

Operation Sindoor: భారత సైన్యం రావల్పిండిలోనూ గర్జించింది: రాజ్‌నాథ్ సింగ్

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 11 , 2025 | 05:44 PM