MLA: అర్హులందరికి అన్నదాత సుఖీభవ
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:56 PM
నియోజకవర్గంలోని ఆర్హులైన ప్రతిఒక్క రైతు ఖాతాలో అన్నదాత సుఖీభవ నిధులు జమ అవుతున్నాయని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని వెంగళమ్మచెరువులో శనివారం నిర్వహించిన ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు.
‘రైతన్నా.. మీకోసం’లో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి
పుట్టపర్తిరూరల్, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలోని ఆర్హులైన ప్రతిఒక్క రైతు ఖాతాలో అన్నదాత సుఖీభవ నిధులు జమ అవుతున్నాయని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని వెంగళమ్మచెరువులో శనివారం నిర్వహించిన ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంక్షేమం ఒక్క కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. రైతులు మార్కెట్‌లో డిమాండ్‌ఉన్న పంటలను సాగుచేయాల న్నారు. భూగర్భ జలాల పెంపు కోసం ఇంకుడు గుంతలు నిర్మించుకోవా లని సూచిం చారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు శ్రీరామిరెడ్డి, పీఏసీస్ డైరక్టర్లు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.