GOD : ఘనంగా ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ
ABN , Publish Date - Mar 10 , 2025 | 12:27 AM
మండలంలోని తిమ్మాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆంజేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, పలువురు టీడీీపీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నా రు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం ఉదయం 7గంటలకు పలు హోమాలు నిర్వహించారు.
- పాల్గొన్న ఎమ్మెల్యే పరిటాల సునీత
రామగిరి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని తిమ్మాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో ఆంజేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత, పలువురు టీడీీపీ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నా రు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం ఉదయం 7గంటలకు పలు హోమాలు నిర్వహించారు. ఈ హోమాలలో ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ సీనియర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రత్యేక పూజలు చేయించారు. దేవాలయ నిర్మాణానికి ఎమ్మె ల్యేతో పాటు పరిటాల ట్రస్టు, టీడీపీ సీనియర్ నాయకుడు ఎల్ నారా యణ చౌదరి తదితరుల సహాయ సహకారాలు ఉన్నాయని గ్రామస్థు లు తెలిపారు. గ్రామస్థుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేపట్టా రు. స్వామి వారి దర్శనానికి సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు, మండల కన్వీనర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
రామగిరి మండలపరిధిలోని వెంకటాపురం లో ఉన్న క్యాంప్ కార్యా లయంలో ఆదివారం ఎమ్మెల్యే పరిటాల సునీత రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి మండలాలకు సంబంధించిన 16 మందికి రూ.14.96 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీచేశారు. బాధితుల సహాయార్థం ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....