TWO: అటు పీజీఆర్‌ఎస్... ఇటు మండల మీట్
ABN , Publish Date - Sep 15 , 2025 | 11:57 PM
సాధారణంగా ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్ర జా సమస్యల పరి ష్కార వేది కలో మండల స్థాయి అధికారు లందరూ మధ్యాహ్న భోజనం విరామం వరకు పాల్గొన్నది జగమెరిగిన సత్యం. అదేవిధంగా మూడునెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావే శంలోనూ మండలంలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించాల్సి ఉంటుంది.
ఇబ్బందులు పడ్డ అధికారులు...
వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు
తాడిమర్రి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): సాధారణంగా ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్ర జా సమస్యల పరి ష్కార వేది కలో మండల స్థాయి అధికారు లందరూ మధ్యాహ్న భోజనం విరామం వరకు పాల్గొన్నది జగమెరిగిన సత్యం. అదేవిధంగా మూడునెలలకు ఒకసారి నిర్వహించే మండల సర్వసభ్య సమావే శంలోనూ మండలంలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించాల్సి ఉంటుంది. ఈ రెండు కార్యక్రమాలను సోమవారం ఒకే రోజు నిర్వహిం చడం పట్ల కొందరు అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అధికారులతో పాటు సమస్యలపై గ్రీవెన్సలో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలు ఎంపీడీఓతో పాటు పలువురు అధికారులు లేకపోవడంతో కొంత ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఎంపీడీఓ రంగారావును వివరణ కోరాగా... మండల సర్వసభ్య సమావేశానికి 90 రోజుల గడువు ముగుస్తుందనే ఉద్దే శ్యంతో.... మండలంలోని ప్రజాప్రతినిధుల అనుమతితోనే సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు.