BRIDGE: రక్షణ గోడలు లేని ఎగువ బ్రిడ్జి
ABN , Publish Date - Aug 26 , 2025 | 11:45 PM
మండలంలోని కంబాలపర్తి గ్రామ సమీపంలో గొడ్డిచింతమాను వద్ద ఉన్న ఎగువ బ్రిడ్జికి ఇరురువైపులా రక్ష గోడలు లేవు. దీంతో ఆ దారివెంట రాకపోకలు సాగించే పలువురు ప్రమా దాల బారిన పడుతున్నట్లు ప్రయాణికులు, గ్రామస్థులు వాపోతున్నారు. నల్లమాడ నుంచి పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ఎగువ బ్రిడ్జి రోడ్డుకు సమానంగా ఉంది.
నల్లమాడ, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని కంబాలపర్తి గ్రామ సమీపంలో గొడ్డిచింతమాను వద్ద ఉన్న ఎగువ బ్రిడ్జికి ఇరురువైపులా రక్ష గోడలు లేవు. దీంతో ఆ దారివెంట రాకపోకలు సాగించే పలువురు ప్రమా దాల బారిన పడుతున్నట్లు ప్రయాణికులు, గ్రామస్థులు వాపోతున్నారు. నల్లమాడ నుంచి పుట్టపర్తికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న ఎగువ బ్రిడ్జి రోడ్డుకు సమానంగా ఉంది. ఈ బ్రిడ్జికి ఇరువైపులా ముళ్లచెట్లు, పిచ్చి మొక్కలు ఏపుగా పెరడంతో పాటు రక్షణ గోడలు లేవు. దీంతో వాహన చోదకులు ఏ మాత్రం అదమరిచినా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలా ప్రమాదాలు జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయని గ్రామస్థులు తెలు పుతున్నారు. ఈ బ్రిడ్జికి రక్షణ గోడ లేకపోవడంతో మూడు రోజుల క్రితం కుటాలపల్లి తండా నుంచి పుట్టపర్తికి కూలీల వెళ్తున్న ఆటో కూడా బోల్తా పడిందన్నారు. ఈప్రమాదంలో ఓ మహిళ మృతిచెందిందని తెలిపా రు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జికి ఇరువైపులా రక్షణ గోడలు నిర్మించాలని ప్రయాణికులు, గ్రామస్థులు కోరుతున్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....