Share News

ROAD: మగ్గాల వీధిలో పైపులు పూడ్చి వదిలేసిన రోడ్డు

ABN , Publish Date - Oct 28 , 2025 | 10:23 PM

ఆధ్మాత్మిక కేంద్రమైన పుట్టపర్తి లో... చాలా ప్రాంతాల్లో ఎటు చూసినా గుంతల రోడ్లే ద ర్శన మిస్తున్నాయి. తర చూ రోడ్లను తవ్వడం.. పూ డ్చడం చేస్తుండడంతో సిమెంట్‌ రోడ్లు కాస్త మట్టి రోడ్లుగా, గుంతల రోడ్లుగా మారాయి. రక్షిత మంచి నీటి సరఫరా ఏర్పాట్ల పేరుతో ఉన్న సీసీ రోడ్లను తొలగించి పైప్‌లైన్లను వే శారు. పైపు లైన్లను పూడ్చి రెండేళ్లు పూర్తయినా ఇంతవరకు రోడ్లను మాత్రం బాగు చేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు.

ROAD: మగ్గాల వీధిలో పైపులు పూడ్చి వదిలేసిన రోడ్డు

రోడ్ల పునరుద్ధరణపై నిర్లక్ష్యం

- తాగునీటి పైపులు పూడ్చి వదిలేసిన వైనం

- కొన్నేళ్లుగా గుంతల రోడ్లతో ప్రజల ఇబ్బందులు

పుట్టపర్తి, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఆధ్మాత్మిక కేంద్రమైన పుట్టపర్తి లో... చాలా ప్రాంతాల్లో ఎటు చూసినా గుంతల రోడ్లే ద ర్శన మిస్తున్నాయి. తర చూ రోడ్లను తవ్వడం.. పూ డ్చడం చేస్తుండడంతో సిమెంట్‌ రోడ్లు కాస్త మట్టి రోడ్లుగా, గుంతల రోడ్లుగా మారాయి. రక్షిత మంచి నీటి సరఫరా ఏర్పాట్ల పేరుతో ఉన్న సీసీ రోడ్లను తొలగించి పైప్‌లైన్లను వే శారు. పైపు లైన్లను పూడ్చి రెండేళ్లు పూర్తయినా ఇంతవరకు రోడ్లను మాత్రం బాగు చేయకపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఎనుములపల్లి గణేష్‌ సర్కిల్‌ ప్రాంతంలో పలు వీధులతో పాటు బీసీ, ఎస్సీ కాలనీలు ఎనుములపల్లి పాతూరులోని పలు వీధులలో పైప్‌లైన్లు వేశారు. వీటి కోసం సీసీరోడ్లను తొలగించి పైపులైను పూడ్చారు.


అయితే పైపులు పూడ్చిన ప్రాంతంలో తిరిగి సీసీరోడ్లు వేయకపోవడంతో అవి కాస్త గుంతల మయంగా మారి ప్రయాణికులకు, పాదాచారులకు ఇ బ్బందికరంగా మా రింది. ముఖ్యంగా వీధుల్లో వర్షపునీరు నిలిచి బురద గుంతలు ఏర్పడ్డాయి. పైప్‌లైన వేసిన కాంట్రాక్టర్‌ మాత్రం తిరిగి సి మెంటు రోడ్డు వేయడాన్ని మరచిపోయినట్లు తెలుస్తోంది. మా రోడ్లు బా గుచేయండంటూ స్థానికులు అధికారులను కోరుకుంటున్నారు. ప్రధాన రోడ్డు మాత్రం బాగుంటే సరిపో తుందా... మా రోడ్లను బాగుచెయ్యలేరా అని ఆయా ప్రాంతాల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి కాలనీల్లో ఉన్న రోడ్లను సైతం బాగుచేయాల్సిన అవసరం ఉందని వారు కోరుతున్నారు. సత్యసాయి శతజయంతి వేడుకలకైనా తమ ప్రాంతాల్లోని రోడ్లు బాగుపడతాయనే ఆశతో స్థానికులు ఎదురుచూస్తున్నారు.

మూడేళ్లుగా రోడ్డు వేయలేదు- సుధాకర్‌, బీసీ కాలనీ

నీటిపైపులు పూడ్చారు సిమెంటు రోడ్డు వేయ డం మరచిపోయారు. మూడేళ్ల నుంచి రోడ్డు వే యాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరినా ప ట్టించుకోలేదు. ఇప్పటికైనా రోడ్డు వేస్తే బాగుం టుంది. రోడ్డు లేక చీకట్లో జారిపడుతున్నాం.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 28 , 2025 | 10:23 PM