MLA: అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:55 AM
మండల పరిధిలోని కొక్కంటి క్రాస్‌లో శనివారం అంబేడ్కర్ వ్రిగహావిష్కరణ కార్య్రకమం నిర్వహించా రు. ముఖ్య అతిథులుగా ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే కందికుంట వెంకట్రపసాద్ పాల్గొని అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
పాల్గొన్న ఎంపీ బీకే, ఎమ్మెల్యే కందికుంట
తనకల్లు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కొక్కంటి క్రాస్‌లో శనివారం అంబేడ్కర్ వ్రిగహావిష్కరణ కార్య్రకమం నిర్వహించా రు. ముఖ్య అతిథులుగా ఎంపీ బీకే పార్థసారథి, ఎమ్మెల్యే కందికుంట వెంకట్రపసాద్ పాల్గొని అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహావిష్కరణ లో పాలుపంచుకోవడం తమకు ఎంతో సంతోషదాయకమన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన నిరూపిం చారని వివరిచారు. ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ఉన్న విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరుకున్నప్పుడే ఆయనకు నివాళలర్పించిన వారమవుతామన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. అంబేద్కర్ వ్రిగహ ఏర్పాటుకు కృషి చేసిన వారిని ఎమ్మెల్యే ఎంపి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ రెడ్డి శేఖర్ రెడ్డి, నాయ కులు బంగారు కృష్ణమూర్తి, పవన కుమార్‌రెడ్డి, బీగం శంకర్ నాయుడు, బాగేపల్లి చలపతి, సోపాలెం నాగభూషణం, ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్, పులికంటి నరసింహులు, తహసీల్దార్ షాబుద్దీన, ఎంపీడీఓ రామానా యక్, ఎస్‌ఐ గోపి తదితరులు పాల్గొన్నారు. మాజీ సర్పంచ మస్తాన వలి భోజన వసతి ఏర్పాటు చేశారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....