ALUMNI: పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ABN , Publish Date - Oct 12 , 2025 | 11:45 PM
మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 1998-99 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు 27 సంవత్సరాల తరువాత ఆదివారం కలిశా రు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
తనకల్లు, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో 1998-99 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన విద్యార్థులు 27 సంవత్సరాల తరువాత ఆదివారం కలిశా రు. ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అప్పటి ఉపాధ్యాయులను ఘ నంగా సన్మానించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠ శాల ఆవరణంలో ఆనందంగా గడిపారు. పూర్వ విద్యార్థి రమేష్ పాఠశాలకు తన వంతు సాయంగా లాప్‌టాప్, ప్రింటర్‌ను అం దజేశారు. తాము కూడా భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని మిగితా వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సందీప్‌కుమార్, రమేష్‌నాయక్, కడపల శ్రీకాంతరెడ్డి, వెంకి, రాజేష్, శివ, అనురాధ, నిరూపమ, సహజ, కృష్ణవేణి, సృజన పలువురు పూర్వవిద్యార్థులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....