ALUMNI: పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:53 PM
మండలకేంద్రంలోని జిల్లాపరిషత ఉన్నతపాఠశాలలో 1994-95లో పది చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళ నాన్ని ఆదివారం నిర్వహించారు. అందరూ ఒక్క చోట చేరి గత స్మృతులను జ్ఞాపకం చేసుకున్నారు. ఒకరినొకరు క్షేమసమాచారాలు తెలు సుకుని ఆనం దం వ్యక్తం చేశారు.
నల్లమాడ, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని జిల్లాపరిషత ఉన్నతపాఠశాలలో 1994-95లో పది చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళ నాన్ని ఆదివారం నిర్వహించారు. అందరూ ఒక్క చోట చేరి గత స్మృతులను జ్ఞాపకం చేసుకున్నారు. ఒకరినొకరు క్షేమసమాచారాలు తెలు సుకుని ఆనం దం వ్యక్తం చేశారు. అప్పటి ఉపాధ్యాయులైన వెంకటరమణప్ప, దేవరం, బాషా, సుబహాన, రమాదేవి, వార్డెర్ రవిచంద్రరాజు, ప్రస్తుత ప్రధానోపా ధ్యాయుడు భాస్కర్‌రెడ్డి తదితరులను పూలమాలలు, దుశ్శాలువాలతో సన్మానించారు. పూర్వ విద్యార్థి నల్ల శింగయ్య గారిపల్లికి చెందిన మాడిశెట్టి శ్రీనివాసులు పాఠశాల ఆవరణంలోని జువ్విచెట్టు చుట్టూ అరుగు నిర్మించేందుకు రూ. 20 వేలను ప్రధానోపాధ్యాయుడికి అందజేశారు.
ఓబుళదేవరచెరువు: మండలకేంద్రంలోని జిల్లాపరిషత ఉన్నత పాఠశాలలో 14యేళ్ల కిందట చదువుకున్న మిత్రుల సమ్మేళనాన్ని ఆదివారం నిర్వహించారు. పాఠశాలలో 2010-11లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థు లంతా కలిశారు. అప్పటి జ్ఞాప కాలు గుర్తు చేసుకు న్నారు. అప్పటి ప్రధానోపాధ్యాయుడు కృష్ణానాయక్, ఉపాధ్యాయులు నాగరాజు, గౌస్‌ఖాన, రిజ్వానులా ్లఖాన, లక్ష్మీనారాయణ, రవిచంద్ర, రవీంద్ర, మధుబాబు, బాల నరసింహులు, ఉషారాణి, నీళ్ల ప్రసాద్‌ను దుశ్శాలావాలు, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బాబాఫకృద్దీన, అమర్‌నాథ్‌రెడ్డి, నారాయణస్వామి, అనిల్, మధు, అనిత, నాగజ్యోతి, నాగరత్న, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....