ALUMNI: పూర్వ విద్యార్థుల సమ్మేళనం
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:46 PM
మండలపరిధిలోని పట్నం జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళ నం నిర్వహించారు. ఆ పాఠ శాలలో 1993-94లో పదో తరగతి చదివిన విద్యార్థులు మూడు దశాబ్దాల తరువాత అందరూ ఒకచోట చేరారు.
కదిరి అర్బన, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): మండలపరిధిలోని పట్నం జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళ నం నిర్వహించారు. ఆ పాఠ శాలలో 1993-94లో పదో తరగతి చదివిన విద్యార్థులు మూడు దశాబ్దాల తరువాత అందరూ ఒకచోట చేరారు. అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఒకరినొకరు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పలురకాల వృత్తులు, ఉద్యోగాల్లో వేర్వేరు చోట్ల స్థిరపడిన వారు ఒకచోట చేరడంతో పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు అప్పటి ఉపాధ్యాయులను సన్మానించారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....