Share News

EMPLOTMENT: అర్హత ఉన్నా...ఉద్యోగం ఇవ్వలేదు

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:19 AM

అన్ని ఆర్హత లు ఉన్న తన పేరును ఆర్హత జాబితాలో సూచించారు కానీ ఉద్యోగం మరొకరికి ఇచ్చారని అమరాపురం మండలానికి చెం దిన నదియా కలెక్టరేట్‌ ఎదుట బోరుమంది. ఈ మేరకు ఆమె సోమవారం కలెక్టర్‌ శ్యాం ప్ర సాద్‌కు ఫిర్యాదుచేసింది. అనంతరం ఆమె మట్లాడుతూ... 2024లో కేజీవీబీ నానటీచింగ్‌ పో స్టుకు దరఖాస్తు చేసి ఇంటర్వూలో అర్హతసాదించినప్పటికి ఉద్యోగం ఇవ్వలేదని వాపోయారు.

EMPLOTMENT: అర్హత ఉన్నా...ఉద్యోగం ఇవ్వలేదు
Nadia showing qualification certificate

ఓ యువతి ఆవేదన

పుట్టపర్తిటౌన, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): అన్ని ఆర్హత లు ఉన్న తన పేరును ఆర్హత జాబితాలో సూచించారు కానీ ఉద్యోగం మరొకరికి ఇచ్చారని అమరాపురం మండలానికి చెం దిన నదియా కలెక్టరేట్‌ ఎదుట బోరుమంది. ఈ మేరకు ఆమె సోమవారం కలెక్టర్‌ శ్యాం ప్ర సాద్‌కు ఫిర్యాదుచేసింది. అనంతరం ఆమె మట్లాడుతూ... 2024లో కేజీవీబీ నానటీచింగ్‌ పో స్టుకు దరఖాస్తు చేసి ఇంటర్వూలో అర్హతసాదించినప్పటికి ఉద్యోగం ఇవ్వలేదని వాపోయారు. అర్హత జాబితాలో పేరు ఉన్పప్పటికి ఇతరులకు ఉద్యోగం ఇచ్చారని తెలిపారు. అకౌంటెంట్‌ పోస్టుకూ దరఖాస్తు చేసి ఆర్హత సాధిం చినా అవకాశం ఇవ్వలేదన్నారు. సర్వశిక్షా అభియాన అధికారులు మౌఖిక పరీక్షకు పిలుస్తామని చెప్పి ఇంతవరకు తనను పిలువలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై గతంలోనే కలెక్టరుకు పిర్యాదుచేశానన్నారు. ప్రస్తుతం తనకు న్యాయం చే యాలని మరోసారి కలెక్టరుకు ఫిర్యాదుచేసినట్లు ఆమె తెలిపారు.

Updated Date - Oct 14 , 2025 | 12:19 AM