MLA: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలి
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:39 PM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు నియోజకవర్గంలో అర్హులైన వారంద రికీ అందాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండలపరిషత సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి
బుక్కపట్నం, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు నియోజకవర్గంలో అర్హులైన వారంద రికీ అందాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి సూచించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మండలపరిషత సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించే బాధ్యతను ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తీసుకోవాలని కోరారు. సత్యసాయి శతజయంతి వేడుకల సందర్భంగా రహదారుల అభివృద్ధి కోసం కోరిన వెంటనే స్పందించి రూ. 33.83 కోట్లు నిధులు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన కళ్యాణ్‌కు, కూటమి ప్రభుత్వానికి నియోజక వర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. సిద్దరాంపురంలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని, మండల కేంద్రంలో కొన్నిచోట్ల సీసీ రోడ్లు వే యాలని సంబంధిత ప్రజాప్రతినిధులు కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ మలిరెడ్డి, పట్ట కన్వీనర్ ఎర్రకేశప్ప, ఎంపీడీఓ శ్రీనివాసులు, రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు శ్రీనివాసులు, సాకే యశోద, ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ శ్రీలత, మేజర్ పంచాయతీ సర్పంచ నాగలక్ష్మి, తహసీల్దార్ నరసింహులు, ఏపీఓ శ్రీనివాసరెడ్డి, నాయకులు గంగాధర్, లవాణ్యగౌడ్, వెంకట్రాముడు, మాజీ ఎంపీపీ బాలు, సయ్యద్ బాషా, సర్పంచులు, ఎంపీటీసీలు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....