HLC : అన్నీ మంచి రోజులే..!
ABN , Publish Date - Mar 03 , 2025 | 12:50 AM
తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్చెల్సీ) మరమ్మతుల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంది. ఈక్రమంలోనే గత ప్రభుత్వ ఆంక్షలను ఎత్తేస్తూ రూ.37 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రతి ఏటా కాలువలో కేటాయింపు జలాలను సరిహద్దు నుంచి పీఏబీఆర్ ...
హెచ్చెల్సీ మరమ్మతులకు గ్రీన సిగ్నల్
రూ.37 కోట్లు కే టాయించిన కూటమి ప్రభుత్వం
కాలువ అభివృద్ధిని పట్టించుకోని గత వైసీపీ సర్కార్
రాయదుర్గం/బొమ్మనహాళ్, మార్చి 2(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్చెల్సీ) మరమ్మతుల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుంది. ఈక్రమంలోనే గత ప్రభుత్వ ఆంక్షలను ఎత్తేస్తూ రూ.37 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రతి ఏటా కాలువలో కేటాయింపు జలాలను సరిహద్దు నుంచి పీఏబీఆర్ వరకు తీసుకెళ్లేందుకు అధికారులు కుస్తీలు పట్టే పరిస్థితి ఉండేది. కనీసం ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న చోటుకైనా నిధులు కేటాయించాలని పలు
సంద ర్భాల్లో గత ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదు. దీంతో అధికారులు, అన్నదాతలు సాగునీటి కోసం నానా హైరానా పడేవారు.
సంఘాలదే బాధ్యత
నీటిపంపిణీ వ్యవస్థలో అధికారుల పర్యవేక్షణ అంతంత మాత్రమే. సాగునీటి సంఘాలు కీలకం కానున్నాయి. నీటి సరఫరా సమస్యల పరిష్కారంలో సంఘాలు క్షేత్రస్థాయిలో నిత్యం రైతులకు అందు బాటులో ఉంటాయి. ఏ కాలువలపై సమస్య తలెత్తినా అధికారుల కంటే ముందు సంఘాల సభ్యులు ముందు ఉంటారు. ఎక్కడైనా కాలువలకు గండి పడినా, కట్టలు పగిలిపోయినా, నీటి పారుదలకు సమస్యలు ఏర్పడినా వెంటనే సంఘాలు స్పందించి సమస్యలను పరిష్కరిస్తాయి. సంఘాలు పటిష్టంగా పనిచేస్తే నీటికష్టాల నుంచి రైతులు గట్టెక్కే అవకాశం ఉంటుంది. సాగునీటి కాలువల నిర్వహణను వైసీపీ ప్రభు త్వం ఐదేళ్లు గాలికొదిలేసింది. కాలువల మరమ్మతులకు ఇవ్వాల్సిన నిధులను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించుకుంది. రైతులు ఏటా నీటి తిరువా చెల్లిస్తారు. అయినా సాగునీటి సంఘాలకు వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా, సంబంధిత అధికారులకే నీటి సంఘాల బాధ్యతలను అప్పగించింది.
కాలువలు శిథిలం.. సాగునీటి వ్యవస్థ అధ్వానం
హెచ్చెల్సీ ప్రధాన కాలువపై ఉన్న వంతెనలు, డిసి్ట్రబ్యూటరీ కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాలువల్లో కంప చెట్లు పెద్దఎత్తున పెరిగా యి. దర్గాహొన్నూరు, మల్లికేతి, మీనహళ్లి గ్రామాల సమీపంలో వంతెనలు కూలిపోయాయి. మల్లికేతి వద్ద రైతులే చందాలు వేసుకుని వంతెనలు మరమ్మతు చేసుకున్నారు. సాగునీటి కాలువల నిండా మొక్కలు పెరిగి నీటి ప్రవాహానికి అవరోధంగా మారాయి. డ్రాపులు పగిలిపోయాయి. షట్టర్లు దెబ్బతిన్నాయి. ఆరేళ్లుగా నిధులు లేక మరమ్మ తులు జరగక కాలువలన్నీ పాడుబడ్డాయి. కాలువల నిండా నీరున్నా చివరి అయకట్టు భూములకు సాగు నీరు అందక రైతులు అల్లాడిపోయేవారు. నీటి పంపిణీ వ్యవస్థపై అజమాయిషీ చేసే సాగునీటి సంఘాల ఎన్నికలు నిర్వహించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. దీంతో రైతులు సాగునీటి కష్టాలతోనే ఐదేళ్లు గడిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇటీవలే సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. దీంతో తమ కష్టాలు తీరినట్లేనని రైతులు భావిస్తున్నారు.
కేటాయింపులకు ముందే టెండర్లు
తుంగభద్ర ఎగువ కాలువలో నీటి సరఫరాకు ఎదురయ్యే ఆటంకాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. వచ్చే ఏడాదికల్లా కొన్ని శాశ్వత మరమ్మతులు చేసి నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. చేయాల్సిన పనులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈక్రమంలోనే రూ. 35 కోట్ల పనులకు పరిపాలన అనుమతులను తీసుకుని నెల రోజుల కిందట టెండర్లు పిలిచారు. నీటి సరఫరా ఆగిపోగానే పనులను చేయాలనే సంకల్పంతో ప్రక్రియను సిద్ధం చేసుకుని బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల కోసం నిరీక్షిస్తూ వచ్చారు. చర్లోపల్లి 119-637 కిలోమీటర్ వద్ద అండర్ టెన్నల్ మరమ్మతులకు రూ. 50లక్షలతో, 1వ డిస్ర్టిబ్యూటరీ షట్టర్, కాలువ మరమ్మతులు పనులకు రూ.25 లక్షలు, 112-200కిలో రూ. 12 లక్షలు, 117-200 కిలోమీటర్ వద్ద రూ.2.50 లక్షలతో పాటు మిగతా అత్యవసర పనులు మరమ్మతులు కోసం రూ. 35 కోట్లకు టెండర్లు కూడా అయినట్లు అధికారులు తెలిపారు. తర్వలో పనులు ప్రారంభం అవుతాయని అన్నారు. లైనింగ్ పనులు, అవుట్‌పాల్, రెగ్యులేటర్, పనులు, కూలిపోయిన, శిథిలవస్థకు చేరిన వంతెనలు నిర్మాణానికి నిఽధులు మంజూరు అయినట్లు అధికారులు తెలిపారు. పనులు చేసిన వెంటనే నిధుల విడుదలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా బడ్జెట్‌లో రూ. 37 కోట్లు వీటికోసం కేటాయించారు.
హెచ్చెల్సీని నిర్వీర్యం చేసిన
వైసీపీ : కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ విప్
గత వైసీపీ ప్రభుత్వం హెచ్చెల్సీని ఐదేళ్ల కాలంలో నిర్వీర్యం చేసింది. ఆధునికీకరణ పనులు పూర్తి చేయకపోవడం వల్ల ప్రతి ఏటా ఎక్కడో ఒక్కచోట కాలువకు గండి పడి నీరంతా వృథా అయ్యింది. జిల్లా ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలకు జీవనాధారమైన తుంగభద్ర ఎగువ కాలువకు కనీసం మరమ్మతులు చేయకపోవడంతో చాలా బాధ కలిగేది. ఇదే విషయంగా గత వైసీపీ ప్రభుత్వానికి, కలెక్టర్లకు పలుమార్లు లేఖలు రాసిన పట్టించుకోలేదు. అత్యవసర మరమ్మతుల కోసం నిధులను కేటాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక బడ్జెట్‌లో అత్య వసర పనుల కోసం రూ. 37 కోట్లు కేటాయించింది. త్వరలో పనులు కూడా ప్రారంభం అవుతాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....