AWARENESS: ఎయిడ్స్‌పై అవగాహన
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:27 AM
ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని సోమవారం ధర్మవరం, కదిరి పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో నిర్వహించారు. వైద్యాధికారులు, సిబ్బంది, మున్సిపాలిటీ, మండల స్థాయి అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మానవహారం ఏర్పాటుచేసి, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు.
(ఆంధ్రజ్యోతి, న్యూస్ నెట్‌వర్క్)
ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని సోమవారం ధర్మవరం, కదిరి పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో నిర్వహించారు. వైద్యాధికారులు, సిబ్బంది, మున్సిపాలిటీ, మండల స్థాయి అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. మానవహారం ఏర్పాటుచేసి, ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. ధర్మవరం పట్టణంలోని ఏరియా ప్రభుత్వాస్పత్రి, ఐసీటీసీ, శక్తిమైత్రి మహిళా సంఘం, స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినాన్ని నిర్వహించారు. అదేవిధంగా ప్రభు త్వ బాలికల జూనియర్ కళాశాలవిద్యార్థినులు ఎయిడ్స్ మహమ్మారి దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి కాలేజ్ సర్కిల్‌లో దహనం చేశారు. అలాగే కొత్తచెరువు జూనియర్ కళాశాలలో విద్యార్థు లకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. కదిరి పట్టణంలో స్థానిక ప్రభుత్వ ఏరియా అసుపత్రి వద్ద నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ధర్మవరంరూరల్ మండలంలోని దర్శిన మల, గాండ్లపెంట, ముదిగుబ్బ, నల్లమాడ పీహెచసీల ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు.