Share News

CROPS: పంటలను పరిశీలించిన వ్యవసాయ అదికారులు

ABN , Publish Date - Oct 29 , 2025 | 11:38 PM

మండలపరిదిలోని గంటాపురం గ్రామంలో సాగు చేసిన కంది, వేరుశనగ, మొక్కజొన్న పంటలను శాస్త్రవేత్త మాధవిలత, ఏడీఏ లక్ష్మనాయక్‌ బుధవారం పరిశీలించారు. కందిలో మరుకా మచ్చల పురుగును గుర్తించారు. దీని నివారణకు వేప నూనె 1000మి.లీ. క్లోరోఫైరిఫాస్‌ 500మి.లీ. కలిపి ఎకరాకు పిచికారి చేయాలని తెలిపారు.

CROPS: పంటలను పరిశీలించిన వ్యవసాయ అదికారులు
Agriculture officials giving instructions to farmers

బత్తలపల్లి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మండలపరిదిలోని గంటాపురం గ్రామంలో సాగు చేసిన కంది, వేరుశనగ, మొక్కజొన్న పంటలను శాస్త్రవేత్త మాధవిలత, ఏడీఏ లక్ష్మనాయక్‌ బుధవారం పరిశీలించారు. కందిలో మరుకా మచ్చల పురుగును గుర్తించారు. దీని నివారణకు వేప నూనె 1000మి.లీ. క్లోరోఫైరిఫాస్‌ 500మి.లీ. కలిపి ఎకరాకు పిచికారి చేయాలని తెలిపారు. అలాగే వేరుశనగను ఆకుమచ్చ తెగులు సోకిందని, దీని నివారణకు బావిష్టిన 200గ్రాములు లేదా హెక్సాకొనజల్‌ 400మి.లీ.ను లీటరు నీటిలో కలిపి ఎకరాకు పిచికారి చేయాలని తెలిపారు. అలాగే మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు ఇమా మెక్టిన బెంజోయేట్‌ 80గ్రాములు ఎకరాకు వాడాలని సూచించారు. పంటలకు తెగుళ్లు సోకినప్పుడు రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించి మందులు వాడాలని తెలిపారు. అలాగే ఈ నెలాఖరిలోగా ఈ క్రాప్‌ నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ ఓబిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Oct 29 , 2025 | 11:38 PM