MLA: వ్యవసాయాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:49 AM
వ్యవసాయాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కి సాన - అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు వ్యవసాయం పె ట్టుబడి సాయం అందిస్తున్నాయని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని పోతు కుం ట గ్రామంలో పీఎం కిసాన - అన్నదాత సుఖీభవ గ్రామసభను బుఽధ వారం నిర్వహించారు.
ఎమ్మెల్యే సింధూరరెడ్డి
కొత్తచెరువు, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): వ్యవసాయాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం కి సాన - అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు వ్యవసాయం పె ట్టుబడి సాయం అందిస్తున్నాయని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని పోతు కుం ట గ్రామంలో పీఎం కిసాన - అన్నదాత సుఖీభవ గ్రామసభను బుఽధ వారం నిర్వహించారు. ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
రాష్ట్రంలో పాలనలో కష్టనష్టాలు ఎన్ని ఉన్నా రైతులకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నదాత సుఖీభవ పథ కాన్ని పీఎం కిసానతో కలిపి ఏడాదికి రూ.20వేలు ఆర్థిక సాయం అంద జేస్తున్నారన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో 44,340 మంది రైతులకు గాను రూ.29.95కోట్లు నగదును రైతుల ఖాతాల్లోకి జమచేశారన్నారు. ప్రతి రైతు ఈ నగదును సద్వినియోగం చేసుకోవాలని వారు సూచిం చారు. అనంతరం ప్రభుత్వం సబ్సిడీకింద అందజేసిన డ్రోనను మహిళా రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి సతీశబాబు, టీడీపీ సీనియర్ నాయకులు సాలక్కగారి శ్రీనివాసులు, మండల, టౌన కన్వీనర్‌లు రామకృష్ణ,శీన, సహకార సంఘం అధ్యక్షుడు హరిప్రసాద్, టీడీపీ నాయకులు నాగేంద్రప్రసాద్, రైతులు పాల్గొన్నారు.