PGRS: పీజీఆర్‌ఎస్‌కు అధికారుల గైర్హాజరు
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:12 AM
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వ హించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధికారు లు ప్రతి సారి డుమ్మా కొడుతూనే ఉన్నారు. ఈ సోమవారం కూడా ఉద యం 11 గంటలైనా చాలామంది అధికారులు హాజరుకాలేదు.
ఓబుళదేవరచెరువు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి ): ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వ హించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధికారు లు ప్రతి సారి డుమ్మా కొడుతూనే ఉన్నారు. ఈ సోమవారం కూడా ఉద యం 11 గంటలైనా చాలామంది అధికారులు హాజరుకాలేదు. కేవలం తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ శివరామప్రసాద్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ వర్క్ ఇనస్పెక్టర్ రవీంద్ర, ఇరిగేషన శాఖ ప్రతినిధి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ విజయకుమారి, వెలుగు ఇనచార్జ్ ఏపీఎం పద్మజ మినహా ఏ ఒక్క అధికారి కూడా హాజరు కాలేదు. ఆ తరువాత చుట్టపు చూపుగా అధికారులు అరగంటకు ఒకరు చొప్పున ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలోకి వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోయారు. దీంతో ఇక ఎప్పటికీ వీరు మారరా? అంటూ అక్కడికి వచ్చిన ప్రజలు మాట్లా డుకుంటున్నారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి అధికారుల గైర్హాజరుపై తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... కార్యక్రమానికి హాజరుకాని అఽధికారులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....