CM: ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
ABN , Publish Date - Nov 01 , 2025 | 11:37 PM
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం తలుపుల మండ లంలోని పెద్దన్నవారిపల్లికి వచ్చారు. హెలిప్యాడ్ వద్ద నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రెవెన్యూ శాఖమంత్రి, జిల్లా ఇనచార్జ్ మంత్రి అవగా న సత్యప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి ఎమ్మెల్యేలు కందికుంట వెంక టప్రసాద్, పరిటాల సునీత, పల్లె సింధూరరెడ్డితదితరులు పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు.
తనకల్లు/నల్లచెరువు/ కదిరిఅర్బన నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం తలుపుల మండ లంలోని పెద్దన్నవారిపల్లికి వచ్చారు. హెలిప్యాడ్ వద్ద నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రెవెన్యూ శాఖమంత్రి, జిల్లా ఇనచార్జ్ మంత్రి అవగా న సత్యప్రసాద్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎంపీ బీకే పార్థసారథి ఎమ్మెల్యేలు కందికుంట వెంక టప్రసాద్, పరిటాల సునీత, పల్లె సింధూరరెడ్డి, కలె క్టర్ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ మౌర్యాభరద్వాజ్, ఆర్డీఓ లు వీవీఎస్ శర్మ, సువర్ణ, ఆనంద్‌కుమార్, మహేష్, మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎంఎస్ పార్థసారఽథి వీరన్న, బీజేపీ నాయకు లు విష్ణువర్ధన రెడ్డి, వంశీ, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షురాలు ఫ ర్వీనబాను, ఉప్పర కార్పొరేషన చైర్మన వెంకటరమణ, తదితరులు పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు.
సీఎంను కలిసిన ఎమ్మెల్యేపరిటాల సునీత
కదిరి/తనకల్లు: తలుపుల మండలం పెద్దన్న వారిపల్లిలో నిర్వహించిన ప్రజావేదికలో ఎమ్మెల్యే పరి టాల సునీత, శ్రీరామ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏ ముఖ్యమంత్రి మాట్లాడుతూ అనంతపురం జిల్లా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. జిల్లాలోని ప్రతి చెరువుకు, ప్రతి ఎకరాకు నీరిస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడంపట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. సీఎంను కలిసి ప్రత్యేక దన్యావాదాలు తెలిపారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....