FLAG: ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:50 PM
ప్రతి ఒక్కరి మదిలో దేశభక్తిని చాటిచెప్పేలా ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం రెపరెపలా డాలని బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు పిలుపుని చ్చారు. ప్రతి ఒక్కరి హృదయం స్పందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆగస్టు 15న వేడుకలకు సిద్ధం కా వాలని కోరారు.
బీజేపీ, జనసేన నాయకులు
ధర్మవరం, ఆగస్టు 13(ఆంఽధ్రజ్యోతి): ప్రతి ఒక్కరి మదిలో దేశభక్తిని చాటిచెప్పేలా ప్రతి ఇంటిపైన త్రివర్ణ పతాకం రెపరెపలా డాలని బీజేపీ నియోజకవర్గ ఇనచార్జ్ హరీశబాబు పిలుపుని చ్చారు. ప్రతి ఒక్కరి హృదయం స్పందించేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆగస్టు 15న వేడుకలకు సిద్ధం కా వాలని కోరారు. ఈ మేరకు బుధవారం పట్టణంలోని కాలేజ్ సర్కిల్ నుంచి కళాజ్యోతి, ఎన్టీఆర్ సర్కిళ్ల మీదుగా గాంధీసర్కిల్ వరకు జాతీయ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. అలాగే బైకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఓబుళేశు, జిల్లా ఉపాధ్యక్షుడు డోలా రాజారెడ్డి, పట్టణ అధ్యక్షుడు జింకా చంద్ర, నాయకులు పోతుకుంట రాజు, ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల ప్రిన్పిపాల్ ప్రశాంతి పాల్గొన్నారు.
కదిరి అర్బన: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశ భక్తిని చాటాలని బీజేపీ, జనసేన నాయకులు పేర్కొన్నారు. పట్ట ణంలోని ఆర్‌అండ్‌బీ బంగ్లా నుంచి బుధవారం కాలేజీ సర్కిల్, అం బేడ్కర్ సర్కిల్ మీదుగా హర్‌ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ కార్యాలయం, ప్రతి ఇంటిపై స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ పతాకం ఎగరాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, బీజేపీ నాయకులు వంశీకృష్ణ, తలుపుల గంగాధర్, జనసేన నాయకులు బైరవప్రసాద్, లక్ష్మన, తుమ్మల రవి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....