Share News

ALUMNI: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ABN , Publish Date - Dec 14 , 2025 | 11:44 PM

దాదాపు నాలుగు దశాబ్దా ల తరువాత వారంతా ఒకచోట కలిశారు. ఒకరి నొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటూ చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. పాఠ శాలలో చదువుకుంటున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం కుటుంబ స్థితిగతులను తెలుసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. నాటి విద్యార్థుల అ పూర్వసమ్మేళానానికి కొత్తచెరువు బాలుర ఉన్నతపాఠశాల వేదికగా మారింది.

ALUMNI: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Former students with then teachers at Kothacheruvu

కొత్తచెరువు, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): దాదాపు నాలుగు దశాబ్దా ల తరువాత వారంతా ఒకచోట కలిశారు. ఒకరి నొకరు ఆప్యాయంగా పలుకరించుకుంటూ చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. పాఠ శాలలో చదువుకుంటున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతం కుటుంబ స్థితిగతులను తెలుసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందంగా గడిపారు. నాటి విద్యార్థుల అ పూర్వసమ్మేళానానికి కొత్తచెరువు బాలుర ఉన్నతపాఠశాల వేదికగా మారింది. ఈ పాఠశాల లో 1985-86లో పదో తరగతి చదివిన విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపు 96 మంది వరకు పూర్వ విద్యా ర్థులు హాజరయ్యారు. తమకు చదువుచెప్పిన అప్పటి ఉపాధ్యాయులు కేశన్న, చంద్రశేఖర్‌, ఓబిరెడ్డి, రామకృష్ణప్ప రామకృష్ణయ్య, శివారెడ్డి, గౌరీ శంకర్‌, రమణారెడ్డి, చెన్నలక్ష్మమ్మ, జబ్బార్‌, ఎల్‌వీ ప్రసాద్‌, ఆర్‌ వెం క టరమణప్పను శాలువాలతో ఘనంగా సన్మానించారు.


చదువుకున్న పా ఠశాలను పుట్టిన గ్రామాన్ని ఎప్పటికి మరువరాదని ఆ ఉపాధ్యా యులు విద్యార్థులకు సూచించారు. 40ఏళ్ల తరువాత తామంతా నాడు చదువుకున్న పాఠశాలలో కలవడం, తమ ఉపాధ్యాయులను సన్మానిం చుకోవడం ఆనందంగా ఉందని పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. తాము చదువుకున్న పాఠశాలకు తనవంతు సాయం అందిస్తామని పూర్వవిద్యార్థులు పేర్కొన్నారు.

తనకల్లు: మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో 1996-97 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. వారు ఆ ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో సమావేశమై ఒకరికొక్కరు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వే సుకున్నారు. గత స్మృతులను గుర్తు చేసుకుని ఆనందించారు. తమకు చిన్నప్పుడు విద్య నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. తాము ఇలా ఉండడానికి అప్పటి ఉపాధ్యాయులే కారణమని కొనియా డారు. అప్పటి ఉపాధ్యాయులు వేమనారాయణ, ఖరీముల్లా, వెంకట రమణారెడ్డి, శంకర్‌, అలాగే రికార్డు అసిస్టెంట్‌ హుస్సేనను సత్కరిం చారు. ఈ కార్యక్రమంలో ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు ఖాదర్‌వలి, పూర్వ విద్యార్థులు మంజునాథ్‌, రామ్‌దేశాయి, రవిచంద్ర, చక్రపాణి, రవీంద్ర తదితరులు 60మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.


అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....

Updated Date - Dec 14 , 2025 | 11:44 PM