TDP: 50 ఏళ్ల సమస్యకు పరిష్కారం
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:57 PM
మండలంలోని పొడరాళ్లప ల్లి లో దాదాపు 50 ఏళ్లుగా భూమి కోసం జరుగుతున్న వివాదానికి టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ శాశ్వత పరిష్కారం చూ పారు. ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లిలో కొందరు దళితులు 51 సెంట్లలో గుడిసెలు వేసుకున్నారు. దీనిపై సుమారు 50 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇరు పక్షాల వారు కోర్టుకు వెళ్లినా పరిష్కారం కాలేదు
పరిటాల శ్రీరామ్ చొరవతో ఇరువర్గాలు రాజీ
ముదిగుబ్బ, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని పొడరాళ్లప ల్లి లో దాదాపు 50 ఏళ్లుగా భూమి కోసం జరుగుతున్న వివాదానికి టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాల శ్రీరామ్ శాశ్వత పరిష్కారం చూ పారు. ముదిగుబ్బ మండలం పొడరాళ్లపల్లిలో కొందరు దళితులు 51 సెంట్లలో గుడిసెలు వేసుకున్నారు. దీనిపై సుమారు 50 ఏళ్లుగా వివాదం నడుస్తోంది. ఇరు పక్షాల వారు కోర్టుకు వెళ్లినా పరిష్కారం కాలేదు. ఈ విషయాన్ని దళితులు శ్రీరామ్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయ న ఇరుపక్షాలతో సుధీర్ఘంగా చర్చించి.. రాజీ కుదిర్చారు. భూ యజమా నులకు 20 సెంట్లు, మిగిలిన 31 సెంట్లలో రోడ్లు, డ్రైనేజీలకు 10 సెం ట్లు పోనూ మిగిలిన 21 సెంట్లలో 14 మం ది దళితులకు ఇంటి పట్టా లు అందజేశారు. ఆయన మంగళవారం అనంతపురంలోని తన నివా సంలో వారికి ఇంటి పట్టాలు అందజేశారు. సమస్యకు పరిష్కారం చూ పడంతో ఇటు దళితులు, యజమానులు శ్రీరామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై కోర్టులకు వెళ్లి, ఏళ్ల తరబడి ఇబ్బందులు పడవద్దని, రాజీ మార్గంలో పరిష్కరించుకుంటే ఇరువురికి మేలు జరుగుతుందని పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ కరణం ప్రభాకర్, నాయకులు కోట్ల బాబి, చంద్రబాబు, సునీల్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....