DIG: ప్రధాని పర్యటనకు పటిష్ట బందోబస్తు
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:12 AM
సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల పురస్కరించుకుని ఈనెల19న ప్రశాంతినిల యానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్టు అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జిల్లా పోలీసుకార్యాలయంలోని పోలీసుకమాండ్ కంట్రోల్ రూం ఆవరణలో బందోబస్తు నిమిత్తం వ చ్చిన 17 జిల్లాల పోలీసు అధికారులకు బందోబస్తు ఏర్పాట్లపై దిశాని ర్దేశం చేశారు.
అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి
పుట్టపర్తిరూరల్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల పురస్కరించుకుని ఈనెల19న ప్రశాంతినిల యానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేసినట్టు అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జిల్లా పోలీసుకార్యాలయంలోని పోలీసుకమాండ్ కంట్రోల్ రూం ఆవరణలో బందోబస్తు నిమిత్తం వ చ్చిన 17 జిల్లాల పోలీసు అధికారులకు బందోబస్తు ఏర్పాట్లపై దిశాని ర్దేశం చేశారు. ఈ సందర్భంగా డీఐజీ, ఎస్పీ మాట్లాడుతూ ఈనెల 19న ప్రధాని నరేంద్రమోదీ, 22, 23 తేదీల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు గవర్నరు, డిప్యూటీ సీఎం, వీవీఐపీలు, వీఐపీలు ఉత్సవాలకు హాజర వుతున్న ఆయా సెక్టార్ ఇన్చార్జిలు బ్రీఫింగ్ చేశారు. జియోగ్రాఫికల్ మ్యాప్‌ను ప్రదర్శిస్తూ విమానాశ్రయం నుంచి కార్యక్రమ స్థలాల వరకు మొత్తం రూట్ మ్యాప్‌ను ఎస్పీ తెలియచేశారు. ప్రతిపా యింట్‌లో అప్రమత్తంగా ఉండి, పూర్తి సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలని డీఐజీ పోలీసు అధికారులకు సూచించారు.