SCHOOL: పక్కా భవనం లేని పాఠశాల
ABN , Publish Date - Dec 07 , 2025 | 12:04 AM
ఎన్నేళ్లు... ఇలా ప్రైవేటు భవ నాల్లో ప్రభుత్వ విద్యార్థులకు విద్యాబోధన సాగిస్తారని ఆ గ్రామ స్థులు ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారం చేపట్టినా, విద్యకు పెద్ద పీట వేస్తున్నట్లు ప్రగాల్భాలు పలకడమే తప్ప ఆచరణలో కనిపించడం లేదంటున్నారు. మండలపరిధిలోని ఎర్రగుంటపల్లిలో ఈ పరిస్థితి కనిపి స్తుంది.
వసతులులేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయురాలు
తనకల్లు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ఎన్నేళ్లు... ఇలా ప్రైవేటు భవ నాల్లో ప్రభుత్వ విద్యార్థులకు విద్యాబోధన సాగిస్తారని ఆ గ్రామ స్థులు ప్రశ్నిస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారం చేపట్టినా, విద్యకు పెద్ద పీట వేస్తున్నట్లు ప్రగాల్భాలు పలకడమే తప్ప ఆచరణలో కనిపించడం లేదంటున్నారు. మండలపరిధిలోని ఎర్రగుంటపల్లిలో ఈ పరిస్థితి కనిపి స్తుంది. ఎర్రగుంటపల్లిలోని ప్రాథమిక పాఠశాల భవనం పాడుపడి పోయిందని, ప్రభుత్వ అధికారులే దాదాపు ఏడేళ్ల క్రితం మూసివేశారు. దీంతో అప్పట్లో ఉపాధ్యాయులు చెట్ల కింద చదువులు చెప్పేవారు. గ్రామస్థులే చొరవ చూపి ఆర్డీటీ వారిని ఒప్పించి గ్రామంలోని ఆర్డీటీ కమ్యూనిటీ భవనంలోకి పాఠశాలను మార్చారు. అందులో వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం లేవు. వంటగది లేకపోవడంతో ఏజెన్సీ వారు మధ్యాహ్న భోజనాన్ని ఇంటి వద్దే వండి తీసుకొస్తున్నారు.
పాఠశాలకు వసతులతో కూడిన పక్కా భవన లేకపోవడంతో గ్రామంలోని చాలా మంది పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. ప్రస్తుతం ఆ పాఠశాలలో ఐదు తరగతులకు కలిపి మొత్తం 13మంది విద్యార్థులు ఉన్నారు. ఇదిలా ఉండగా గత వైసీపీ పాలనలో నాడు - నేడు పథకం కింద నిధులు మంజూరయ్యాయి. పునాదుల వరకు వేశారు. అంత లోనే పాఠశాలకు బెంచీలు, తలుపు లు తదితర సామగ్రి వచ్చింది. వాటిని ఎక్కడా ఉంచలేక ఆర్డీటీ కమ్యూనిటీ హాలులోనే ఉంచారు. ఉన్న ఒకే గదిలో సామగ్రి ఆక్ర మించగా మిగిలిన స్థలంలోనే వి ద్యార్థులను కూర్చోబెట్టి భోధన చేసేందుకు ఉపాధ్యాయురాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇలా ఉన్నా పరిశీలించి ఉన్నతా ధికారులకు నివేదికలు పంపాల్సిన మండలస్థాయి అఽధికారులు పట్టించు కోవడం లేదని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అనూరాధ, శివకుమార్ తదితరులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతి నిధులు తమ గ్రామానికి పాఠశాల భవనం మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.
అధికారుల దృష్టికి తీసుకెళ్తాం- లలితమ్మ, ఎంఈఓ
గత వైసీపీ ప్రభుత్వంలో నాడు- నేడు మొదటి విడతలో ఎర్రగుం టపల్లి పాఠశాలకు పక్కాభవనం మంజూరు కాలేదు. రెండోవిడతలో మంజూరైంది. అయితే ఒక విడత మాత్రమే నిధులు వచ్చాయి. దీంతో పునాదులు వేశారు. పాఠశాలకు బెంచీలు, తలుపులు, బోర్డులు, పంపారు. వాటిని బయట ఉంచలేక ఆర్డీటీ కమ్యూనిటీ భవనంలో ఓ పక్క ఉంచాం. తరువాత నిధులు విడుదల కాలేదు. ఈ విషయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. త్వరలోనే సమస్య పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తాం.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....